News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఆ గంట‌న్న‌ర‌లో జ‌గ‌న్ అడిగిoదేమిటి..? జ‌గ‌న్.. మోడి శ‌ర‌ణు కోరారా.?

ఏపీ సీఎం జగన్.. ప్ర‌ధాని మోడితో.. ఏకంగా గంటన్నరపాటు సమావేశం అయ్యారు. మ‌రీ ఈ గంట‌న్న‌ర పాటు ఏకాంతంగా జిరిగిన స‌మావేశంలో ఏం చ‌ర్చించార‌న్న‌ది.. ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక‌వైపు మూడు రాజ‌ధానులు వ‌ద్దంటూ.. రాష్ట్రంలో కొనసాగుతున్న‌ ఆంధోళ‌న‌లు.. ఇంకోవైపు ఆఘ‌మేఘాల మిద వాస‌న మండ‌లీని ర‌ద్దు చేసిన జ‌గ‌న్ కు.. మండ‌లి చైర్మ‌న్ ఇచ్చిన జ‌ల‌క్ తో.. డిఫెన్స్ లో ప‌డ్డ జ‌గ‌న్.. ఈ ప‌రిణామాల మ‌ధ్య .. మోడి- జ‌గ‌న్ భేటీ.. రాజ‌కీయ వ‌ర్గాల్లో తెగ ఆస‌క్తి రేపుతంది.

మూడు రాజధానుల విష‌యంలో.. ఇప్ప‌డికే రాష్ట్ర బిజేపీ త‌మ స్టాండ్ ను ప్ర‌క‌టించింది. రాజ‌ధానుల వికేంద్రిక‌ర‌ణ కాదు.. అభీవృద్ది వికేంద్రిక‌ర‌ణ కావాల‌ని స్ప‌ష్టం చేసిన‌.. బిజేపీ.. అమ‌ర‌వాతిలో రాజ‌ధానిని కొనసాగించాల‌ని ప్ర‌క‌టించింది. అంతేకాదు అమ‌రావతి రైతుల‌కు సంఘీభావం కూడా ప్ర‌క‌టించింది. దీనికి తోడు.. అమ‌రావ‌తికి.. ప్ర‌ధాని మోడి ఇచ్చిన … మ‌ట్టితో పునాది వేసిన సంగ‌తిని గుర్తుచేస్తున్న రాష్ట్ర నేత‌లు న‌థింగ్ డూయింగ్ .. అమ‌రావ‌తిలో రాజ‌ధాని ఉంటుంద‌ని అంటున్నారు. ఈ ప‌రిస్థితుల్లో మూడు రాజ‌ధానుల‌కు మోడి మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తారా..అన్న‌దే ఇప్ప‌డు పోలిటిక‌ల్ గా చ‌ర్చ‌నీయంశ‌మైంది. ఒక‌వేల మూడు రాజ‌ధానుల‌కు కేంద్రం ఓకే అన‌క‌పోతే.. జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటీ..?

- Advertisement -

ఇక శాస‌న మండ‌లి ర‌ద్దు వ్య‌వ‌హారం ప‌ట్ల కూడా.. బిజేపీ వైఖ‌రి ఇలాగే ఉంది. పెద్ద‌ల స‌భ‌ను వ‌ద్ద‌న‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తుంది. అయితే మండ‌లి ర‌ద్దుపై చైర్మ‌న్ఇచ్చిన జ‌ల‌క్ తో ఖంగుతిన్న జ‌గ‌న్.. అసెంబ్లీలో తీర్మాణం చేసి.. కేంద్రానికి పంపించారు. ఇక ఇక దీనిపై పార్ల‌మెంట్ ఆమోదం పొందితే కాని.. జ‌గ‌న్ ఆశ‌లు నెర‌వేర‌వు. అది కావాలంటే.. మోడి క‌టాక్షం జ‌గ‌న్ కు కావల్సిందే. అయితే ఇది చేస్తే మోడికి, బిజేపీకి క‌లిసివ‌చ్చేది ఏంటీ అన్న‌దే ప్ర‌శ్నం. అలా చేయ‌డం వ‌ల‌న‌.. పార్టీకి ఉన్న ఎమ్మెల్సీ సైతం ఎగిరి పోయింది. ఇప్ప‌డికే అసెంబ్లీలో క‌మ‌లంకు సీటేలేదు.. క‌నీసం మండ‌లిలో ఉన్న సీటు కూడా లేకుండా పోతుంది. కాబ‌ట్టి మోడి ఎట్టి ప‌రిస్థితుల్లో మండ‌లి ర‌ద్దు, మూడు రాజ‌ధానుల కు ప‌ట్ల జ‌గ‌న్ కు మ‌ద్దుతు ఇవ్వ‌ర‌ని.. రాష్ట్ర నేత‌లు అంటున్నారు. అయితే.. జ‌గ‌న్ లో గంట‌న్నర పాటు జ‌రిగిన బేటీలో ఏమైన డీల్స్ కుదిరాయా..? జ‌గ‌న్ కోరిక‌కు మోడి సై అంట‌రా.. లేకా.. జ‌గ‌న్ చెప్పింద‌న్న విని.. మోడి .. నై నై అంటారా.? అన్న‌దే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో సెగ‌లు రేపుతుంది.

Leave A Reply

Your email address will not be published.