News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అంత అందంగా ఎలా ఉన్నారు

అందాల భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర కధానాయిగా వెలుగొందుతోంది. అజయ్‌ దేవగణ్‌ కు జంటగా రకుల్‌ నటించిన దే దే ప్యార్‌ దే సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో మంచీ జోష్ మీద ఉంది.  తమిళంలో సూర్య సరసన రకుల్ నటించిన ఎన్జీకే సినిమా మే 31న విడుదల కాబోతోంది. అటు అక్కినేని నాగార్జున నటిస్తున్న మన్మథుడు 2లో ను రకుల్ నటిస్తోంది. ఈ నేపధ్యంలో ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్ వేధికగా అభిమానులతో చాట్ చేసింది. ఈవిశేషాలు మీ కోసం..

నెటిజన్-మీకు ఇష్టమైన పాట?
రకుల్‌- ప్రస్తుతానికి నా మైండ్‌లో ‘దే దే ప్యార్‌ దే’ పాటలే ఉన్నాయి.
నెటిజన్- అజయ్‌ దేవగణ్‌ గురించి చెప్పండి?
రకుల్‌- సెక్యూర్‌ యాక్టర్‌, అద్భుతమైన వ్యక్తి.

rakul
నెటిజన్- మీకు ఇష్టమైంది?
రకుల్‌- నటన.
నెటిజన్- సిద్ధార్థ్‌ మల్హోత్రా గురించి ఒక్క మాటలో చెప్పండి?
రకుల్‌- చాలా కష్టపడే వ్యక్తి.
నెటిజన్- మీ జీవితంలో గర్వంగా చెప్పుకునే క్షణాలు?
రకుల్‌- నా తల్లిదండ్రులు నన్ను చూసి గర్వించే ప్రతి క్షణం.. ఆ సమయంలో నేను సరైన దారిలో వెళ్తున్నాననే భావన కల్గుతుంది.
నెటిజన్- మీకు ఇష్టమైన ప్రదేశం?
రకుల్‌- స్నేహితులు ఉన్న ఏ ప్రదేశమైనా నాకు ఇష్టమే. నాకు వెళ్లే చోటుకన్నా నాతో ఉండే మనుషులు ఎవరన్నదే ముఖ్యం.
నెటిజన్- సమంత గురించి చెప్పండి?
రకుల్‌- నాకు సమంత అంటే ఇష్టం. ఆమె పవర్‌ ఉమన్‌.

- Advertisement -

rakul
నెటిజన్- అల్లు అర్జున్‌ గురించి చెప్పండి?
రకుల్‌- నాకు తెలిసిన వారిలో ఓ మంచి వ్యక్తి.
నెటిజన్- అజయ్‌ దేవగణ్‌ సినిమాల్లో మీకు ఇష్టమైంది?
రకుల్‌- సింగం.
నెటిజన్- పాఠశాలలో చదివే రోజుల్లో మీరు హీరోయిన్‌ అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా?
రకుల్‌- లేదు.. అప్పుడు నేను చిన్న అమ్మాయిని. కానీ ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు హీరోయిన్‌గా ప్రయత్నించాలి అనుకున్నా.
నెటిజన్- రాజమౌళి సర్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే మీరు ఎలా రియాక్ట్‌ అవుతారు?
రకుల్‌- వెంటనే సంతకం చేసేస్తా.
నెటిజన్-  మన్మథుడు 2 షూటింగ్‌ ఎలా జరుగుతోంది?
రకుల్‌- అద్భుతంగా జరుగుతోంది. సెట్‌ మొత్తం ఫన్‌, పాజిటివిటీతో నిండిపోయి ఉంటోంది.
నెటిజన్-  సూపర్‌ హీరోస్‌లో మీకు ఇష్టమైన వారు?
రకుల్‌- ఐరన్‌ మ్యాన్‌.
నెటిజన్- మీ కోరికల్లో ఒకటి?
రకుల్‌- నేను బాగా తినాలి.. కానీ బరువు పెరగకూడదు.- ‘మన్మథుడు 2’ షూటింగ్‌ ఎలా జరుగుతోంది?
నెటిజన్- విహారయాత్రకు మీరు ఎంచుకునే ప్రదేశం?
రకుల్‌- లండన్‌.

rakul
నెటిజన్- మీ అందం రహస్యం?
రకుల్‌- ధన్యవాదాలు.. సంతోషంగా ఉండమే.
నెటిజన్- సాయిపల్లవి గురించి ఒక్క మాట?
రకుల్‌- చాలా సహజంగా ఉంటుంది. నైపుణ్యం, శ్రమించే గుణం ఉన్న అమ్మాయి.
నెటిజన్- రకుల్‌ మీకు ఫిట్‌నెస్‌ సెంటర్లు ఉన్నాయి కదా. మీ అందం, ఫిట్‌నెస్‌ వెనుక ఉన్న రహస్యం చెప్పండి..
రకుల్‌- క్రమశిక్షణ, మిమ్మల్ని మీరు ప్రేమించండి.
నెటిజన్- మీకు ఇంత వరకు ఎంత మంది ప్రపోజ్‌ చేశారు?
రకుల్‌- ఒక్కరు కూడా ప్రపోజ్‌ చేయలేదు.
ఇదండీ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులకు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానాలు.

Leave A Reply

Your email address will not be published.