News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అధికారంలో లేమని అధైరపడవద్దు

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం  కావాలని పీసీసీ అధ్యక్షులు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోదాడలో జరిగిన కాంగ్రేస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి పాల్గొన్నారు. కోదాడ లో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో 35 వార్డులకు 35 గెలవాలని ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలో , రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదని కార్యకర్తలు అధైర్య పడొద్దని ఆయన చెప్పారు. కార్యకర్తలందరు మున్సిపల్ ఎన్నికల్లో సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పింఛన్లు , డబల్ బెడ్ రూమ్స్ ,  రైతు బంధు , నిరుద్యోగ భృతి  పథకాల పేరుమీద తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు మున్సిపల్ ఎన్నికల్లో తగినబుద్ధి చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.