News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అనామిక‌ను ఇంట‌ర్ బోర్డే చంపేసింది.

హైద‌రాబాద్ : త‌ప్పు మీద‌ త‌ప్పుతో.. విధ్యార్థుల జీవితాల‌తో ఆడుకుంటుంది.. తెలంగాణ ఇంట‌ర్ బోర్డ్. బోర్డ్ నిర్వాకంతో ఇర‌వైనాలుగు మంది విధ్యార్తులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. ఇదంతా తూచ్.. మా పొర‌ పాటేమి లేదు.. చిన్న మిస్టేక్స్ మాత్ర‌మే అంటు.. బుకాయించిన ఇంట‌ర్ బోర్డ్ ,తెలంగాణ ప్ర‌భుత్వం.. ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మైన ఆగ్రహం..ప్ర‌తిప‌క్షాల ఆంధోళ‌న‌తో.. దిగివ‌చ్చి.. దిద్దుబాటు చ‌ర్య‌లు అంటు రీ వెరిఫికేష‌న్ చేప‌ట్టింది. అయితే.. తాజాగా బోర్డ్ రివెరిఫికేష‌న్ ఫ‌లితాల‌తో .. బోర్డ్ చేసిన నిర్వాకం.. విధ్యార్థుల‌కు బోర్డ్ చేసిన పాపం బ‌య‌ట‌ప‌డింది. ఏప్రిల్‌ 18, 2019 న తెలంగాణ ఇంట‌ర్ బోర్డ్ ప్ర‌క‌టించిన  ఫ‌లితాల‌లో 20 మార్కులు రావ‌డంతో.. ఆంధోళ‌న‌తో అనామిక అనే విధ్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఇదే అనామిక‌కు.. రివెరిఫికేష‌న్ లో 48 మార్కులు వ‌చ్చాయని బోర్డ్ త‌న వెబ్ సైట్లో పిట్టింది. దీంతో అనామిక ఆత్మ‌హ‌త్య‌కు బోర్డు పాప‌మే కార‌ణ‌మ‌ని తేలిపోయింది. అనామిక‌ను.. బోర్డు నిర్వాక‌మే హ‌త్య చేసింద‌ని.. ఆరోప‌ణ‌లు వెళ్ళువెత్తుతున్నాయి. అంతేకాదు..త‌మ బిడ్డ చావుకు ఇంట‌ర్ బోర్డ్ కార‌ణ‌మ‌ని .. అనామిక కుటుంబ స‌బ్యులు ప్ర‌క‌టించ‌డంతో.. నాలుక క‌రుచుకున్న బోర్డ్ .. మ‌ళ్ళీ త‌న త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు .. మ‌రో త‌ప్పు చేసింది ఇంట‌ర్ బోర్డ్. ఇంతలోనే ఇంటర్ బోర్డు మాట మార్చింది. అనామికకు రీవెరిఫికేషన్ తర్వాత 21 మార్కులే వచ్చినట్లు ప్రకటించింది. క్లరికల్ మిస్టేక్ వల్ల అనామికకు 48 మార్కులు పడ్డాయని ఇంటర్ బోర్డు తెలిపింది. దీనిపై కమిటీ వేస్తున్నట్లు తెలిపింది.

/inter_bord_rivericastion_results, telangana, namika

- Advertisement -

ఏప్రిల్‌ 18, 2019 విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో 3 లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారని ఇంటర్‌ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పరీక్షలు బాగానే రాసినా.. ఫెయిల్ అయ్యామ‌న్న బాధతో ప్రాణాలు తీసుకున్నారు. మొదట విడుదలైన ఫలితాల్లో అనామిక అనే విద్యార్థిని ఫెయిల్‌ అయినట్లు రావడంతో మనస్తాపంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం విడుదలైన రీవెరిఫికేషన్‌ ఫలితాల్లో ఆమె పాస్‌ అయినట్లు రిజల్ట్‌ వచ్చింది. మ‌రి ఇప్పుడు అనామిక పాస్ రిజ‌ల్ట్ తో మొత్తం ఇంట‌ర్ బోర్డ్ నిర్వాకం మ‌రోసారి బ‌ట్ట‌య‌లైంది. మరి ఈ పాపాన్ని క‌ప్పి పుచ్చుకునేందుకు ఇంట‌ర్ బోర్డ్, ప్ర‌భుత్వం ఇంకేలాంటి నిర్వాకాల‌కు పాల్ప‌డుతుందో చూడాలి.
student_fire_on_inter_results.

Leave A Reply

Your email address will not be published.