News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అభద్రతా భావం పెరిగిపోయింది

రాహుల్‌గాంధీ ఫైర్ అయ్యారు. యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్ లో అభద్రతాభావం పెరిగిపోయిందనడానికి ఈ ఘటనే నిదర్శనమని ఆయన అన్నారు. సోంభద్రలో ప్రియాంకను అక్రమంగా అరెస్టు చేయడం ఆందోళనకరం.. తమ సొంత భూమి నుంచి వెళ్లేందుకు నిరాకరించారని 10 మంది ఆదివాసీలను అతిదారుణంగా కాల్చి చంపారు.. వారి కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకను తమ అధికారాలతో పోలీసులు అడ్డుకున్నారు.. యూపీలోని బీజేపీ ప్రభుత్వంలో అభద్రతాభావం పెరుగుతోందని చెప్పడానికి ఇదే నిదర్శనమనిని రాహుల్‌ ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్  సోంభద్ర జిల్లాలోని ఉబ్బా గ్రామంలో ఊరి పెద్ద, గ్రామస్థులకు మధ్య జరిగిన ఘర్షణలో పదిమంది అమాయకులైన ఆదివాసీలు మృతి చెందారు. 36 ఎకరాల భూమి విషయంలో రైతులకు, గ్రామపెద్దకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ భూమిని ఆక్రమించుకోవడానికి వెళ్తుండగా గ్రామపెద్దను రైతులంతా అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామపెద్ద అతని అనుచరులతో రైతులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంక గాంధీ వెళ్లారు. అయితే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ప్రియాంక ధర్నా నిర్వహించారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.