News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అమిత్ షా చెప్పేవన్నీ అబద్దాలే

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమను చంపేందుకు కుట్ర చేస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సంచలన ఆరోపణ చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఆయన హాజరు కాకపోవడంపై ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే లోక్ సభలో లేవనెత్తిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిస్తూ అరెస్టు చేయడం కానీ, నిర్బంధించడం కానీ చేయలేదని చెప్పుకొచ్చారు. ఫారూఖ్ అబ్దుల్లా తన ఇంట్లోనే ఉన్నారని అమిత్ షా ప్రకటించారు. లోక్ సభలో అమిత్ షా ప్రకటన చేసిన కాసేపటికే ఫారూక్ అబ్దుల్లా ఈ ఆరోపణలు చేశారు. అమిత్ షా అన్నీ అబద్దాలు చెబుతున్నారని, తనను తన ఇంట్లోనే నిర్భంధించారని ఆయన చెప్పారు. తన కుమారుడిని జైలుకు పంపించారని పేర్కొన్నారు. కశ్మీర్ అంశంపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఫారూక్ అబ్దుల్లా స్పష్టం చేశారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.