News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అమెరికాలో జాలీగా గడిపిన చంద్రబాబు

టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అమెరికాలో ఎంజాయ్ చేస్తున్నారు.ఎప్పుడూ రాజకీయాలు, సమావేశాలు, సమీక్షలు, టెలీ కాన్ఫరెన్స్ లతో బిజీ బిజీగా ఉండే చంద్రబాబు అమెరికాలో మాత్రం చాలా సరదాగా గడిపారు. వారం రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన చంద్రబాబు ప్రవాసాంధ్రులతో కలిసి అమెరికా వీధుల్లో కలివిడిగా తిరిగారు. అక్కడ రోడ్లమీద సాధారణ పౌరుడిగా ఆసక్తిగా అన్నింటినీ తిలకించారు. ఆంధ్రప్రదేశ్లో మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం పనిచేసిన ఎన్నారైలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాగా తాజా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, సతీష్ వేమన తదితరులు మిన్నీస్ హోటల్‌లో చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. చంద్రబాబు ఆరోగ్య పరీక్షల కోసం రావడంతో వారు ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో అమెరికా వెళ్లిన చంద్రబాబు అక్కడ షాపింగ్ కూడా చేశారట.

- Advertisement -

chandra babu

Leave A Reply

Your email address will not be published.