News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

అశోకగజపతి రాజుకు మోడీ బంపర్ ఆఫర్

అమరావతి : కేంద్రమాజీ మంత్రి అశోక గజపతిరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారా .. రాజకీయాల్లో కూతుర్ని కూడా తీసుకువచ్చిన రాజుగారు టీడీపీ ప్రస్తుత పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నారా .. రాజకీయాల్లో కొనసాగాలంటే మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారా .. ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీలోనే ఉంటే తనకు భవిష్యత్తు ఉండదని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారు. మోడీ హయాంలో ఎన్డీయేలో ఉన్న తెలుగుదేశం పార్టీ…విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజుని కేబినెట్లోకి తీసుకోవాలని కోరడంతో, మోడీ ఆయన ను పౌరవిమానయాన శాఖమంత్రిగా కీలకమయిన బాధ్యతలు అప్పగించారు. తనకు అప్పగించిన బాధ్యతలను ఆయన సమర్థవంతంగానే నిర్వర్తించారు. గజపతిరాజు హుందాతనం, మాటకారితనం అన్నీ నచ్చిన మోడీ ఆయనకు ఎంతో గౌరవం ఇచ్చే వారని చెబుతారు. కీలకనిర్ణయాలు తీసుకునే సమయంలో మోడీ అశోకగజపతిరాజుని సంప్రదించేవారని చెబుతారు.

Ashoka gajapathi

2018లో టీడీపీ కేంద్రమంత్రివర్గం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా మోడీతో అశోక్ గజపతిరాజుకి సత్సంబంధాలుండేవి. మీరు టీడీపీకి రాజీనామా చేయండి, మంత్రివర్గంలో కొనసాగండి.. అని మోడీ సలహా ఇచ్చారని సమాచారం. ఒకవేళ టీడీపీకి రాజీనామా చేస్తే.. ఏదో రాష్ట్రం నుంచి ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చి మంత్రివర్గంలో కొనసాగించేవారని అంటున్నారు. కానీ తాను టీడీపీలో నిబద్ధత కలిగిన నేతనని చెబుతూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు అశోక గజపతిరాజు. అప్పటినుంచి ఇప్పటివరకూ ఆయన టీడీపీలోనే కొనసాగారు. మోడీతో ఆయన అనుబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో అశోక గజపతిరాజు చాలా అసహనంగా ఉంటున్నారు. ఎన్నికల సమయంలో, ఆతర్వాత తన అసంతృ‌ప్తిని బయటపెట్టారు అశోక గజపతిరాజు. బాబు టెక్నాలజీ, టెలికాన్ఫరెన్సులుపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వేల మందితో కాన్ఫరెన్సుల వల్ల వాస్తవాలు చెప్పే అవకాశం లేకుండా పోయిందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. తాజాగా మరోమారు అశోక్ గజపతిరాజు అంశం తెరమీదకు వచ్చింది. రెండవసారి ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన నరేంద్ర మోడీ టీడీపీ సీనియర్ నేత అయిన అశోక గజపతిరాజుకి బంపర్ ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. టీడీపీని వీడి బయటకు వస్తే కీలక పదవి ఆయనకు ఇవ్వడానికి మోడీ అంగీకరించారని ఢిల్లీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

Ashoka gajapathi

ఈశాన్య రాష్ట్రాల్లో ఏదో ఒకదానికి అశోక్ గజపతిరాజుని గవర్నర్‌గా పంపే అవకాశం ఉందని ఢిల్లీలో చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి భవిష్యత్తు లేదని అశోక్ గజపతిరాజు భావిస్తున్నారని, ఆయన ఏ క్షణంలోనైనా కీలక నిర్ణయం తీసుకోవడం ఖాయమని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌ గా పంపితే మాత్రం అశోక్ గజపతిరాజు రాజకీయంగా క్రియాశీలకం కావడం ఖాయం. గవర్నర్ పదవి కాకుంటే అంతకంటే కీలకమయిన పదవి ఆయన కోసం ఎదురుచూస్తోందని అంటున్నారు. ఒకవేళ అశోక్ గజపతిరాజు టీడీపీని వీడితే మాత్రం ఉత్తరాంధ్రలో టీడీపీ క్యాడర్ బలహీనపడుతుందని ఆందోళన చెందుతున్నారు

Ashoka gajapathi

Leave A Reply

Your email address will not be published.