News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఈ అన్నదమ్ములు ఎవరికి అర్థం కారు..!

హైదరాబాద్ : రాజకీయాల విషయానికి వస్తె అందరు మాట్లాడుకుంటారు.. గల్లీ రాజకీయాల దగ్గరినుంచి దేశ రాజకీయాలు.. అవసరం అయితే ప్రపంచంలో ఏమి రాజకీయాలు జరుగుతున్నా యో కూడా చర్చింకుంటారు కానీ తెలంగాణ పొలిటికల్ పిక్చర్ లో ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎవరికి అర్థం కావటం లేదు. వారికి ఓట్లేసి గెలిపించిన ఆయా నియోజకవర్గ ప్రజలకు కూడా అర్థం కావటం లేదట. ఆ ఇద్దరు ఎవరో ఇప్పటికే అర్థం అయి వుండవచ్చు. వారే కోమటిరెడ్డి బ్రదర్స్.

రాజగోపాల్ రెడ్డి ని మొన్నటి ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే గా ఎన్నుకున్నారు. ఇక వెంకట్ రెడ్డిని భువనగిరి ఎంపీ గా గెలిపించారు. ఇక్కడనే ఇద్దరు అన్నదమ్ములు పొలిటికల్ గేమ్ మొదలుపెట్టారు. గోపాల్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉంటూ బిజెపి నీ మోస్తున్నారు. రాష్ట్రం, దేశం బాగుపడాలంటే బిజేపినే కరెక్ట్ అంటారు. మరో ఇరవై ఏళ్లు అయినా కాంగ్రెస్ లేవదు అంటూ సొంత పార్టీనే కించపరుస్తూ కార్యకర్తల్ని అవమానిస్తున్నారు. అసలు ఈయన కాంగ్రెస్ లో వుంటాడా లేక బిజెపి వెళ్తాడా అనేది ఆయనకే తెలియాలి. బిజెపి వైపు మాట్లాడే కన్నా ముందు టిఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం అయ్యింది. ఆయన అనుచరుడు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టిఆర్ఎస్ లో చేరటం తో రాజగోపాల్ రెడ్డే పంపాడని చర్చ జరిగింది.

- Advertisement -

Komatireddy brothers darty palitics

ఇక వెంకట్ రెడ్డి ఏంటో ఎవరికి అర్థం కావటం లేదు. తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డి కి తనకు మధ్య మాటలు లేవని అనుచరులకు చెబుతున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల ప్రచారం లో ఇద్దరు కలిసి పాల్గొన్నారు. తన అన్నకు ఓటు వేసి గెలిపించాలని రాజ గోపాల్ రెడ్డి ప్రచారం చేశారు. ఇక తన తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డి రాజకీయాలకు తన కు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. రాజ్ గోపాల్ రెడ్డి బిజెపి లో చేరుతారని ప్రచారం అవుతుండటంతో తాను కాంగ్రెస్ లోనే వుంటానని చెప్పాలని అనుకుంటున్నారేమో .. అప్పటినుంచే యాక్టివ్ గా కనిపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా యాదాద్రి పరిశీలనకు వెళ్ళిన సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అదికూడా ఎవరూ లేకుండా ఒంటరి గా. బయటకు వచ్చాక ఆలేరు, భువనగిరి కి తాగునీటి కోసం అని మీడియా కు చెప్పారు. ఒకవేళ ఇవే సమస్యలపై సీఎంను కలవాలని అనుకుంటే హైదరాబాద్ లోనే సమావేశం కావొచ్చు. కానీ యాదాద్రి లో ఎందుకు అయ్యారు అనేది మాత్రం సంస్పెన్స్. మొత్తనికి ఇద్దరు బ్రదర్స్ గేమ్ ప్లాన్ ఎంతో ఎవరికి అర్థం కావటం లేదు

Leave A Reply

Your email address will not be published.