News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఎంపీ ఎన్నికల ఫలితాలు టీఆర్ ఎస్ కు చెంపపెట్టు

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. నల్గొండ లోక్ సభ స్థానం నుంచి ఉత్తమ్ గెలుపొందారు. టీఆర్ ఎస్ అభ్యర్ధి వేమిరెడ్డి నర్సింహా రెడ్డిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి 25వేల 722 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోను హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందడంతో ఉత్తమ్ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. తనను గెలిపించిన ప్రజలకు ఉత్తమ్ కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ ఎస్ పార్టీ అహంకారానికి కొంత మేర ఇది చెంప పెట్టులాంటి తీర్పని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. అసహ్యకరమైన.. జుగుప్సాకరమైన టీఆర్ ఎస్ రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిరస్కరించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

uttam

- Advertisement -

ఇక పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొడంగల్‌ ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున రెండు సార్లు గెలుపొంది ఫైర్‌బ్రాండ్‌ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి  2018 డిసెంబరులో జరిగిన  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయినా పట్టువీడకుండా అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వంపై విరుచుకుపడుతూ తన వాణిని బలంగా వినిపించారు. ప్రభుత్వాన్ని  ప్రశ్నించగలిగే సత్తా ఉన్న నాయకుడిగా గుర్తింపుతెచ్చుకున్నారు. దీంతో కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఓటమి చవిచూసినా… మల్కాజ్‌గిరి ఎంపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అటు ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి  కాంగ్రెస్‌ తరఫున నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి  ఓడిపోయారు. అయినా ఓటమి భారంతో కుంగిపోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. టీఆర్ ఎస్ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌పై ఆయన గెలుపొందారు.

 

Leave A Reply

Your email address will not be published.