News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఎవరు గెలుస్తారో చూద్దామా

ప్రపంచకప్‌ మెగా టోర్నీ మరో ఆరు రోజుల్లో  మొదలు కానుంది. ఈ నేపధ్యంలో ప్రపంచ కప్‌ టోర్నీలో పాల్గొనబోయే జట్ల సారథులందరూ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రపంచ కప్‌లో భారీ స్కోర్లు నమోదు కావచ్చని టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ అభిప్రాయపడ్డారు. మీడియా సమావేశం అనంతరం వివిధ జట్ల సారథులందరూ ఫొటో సేషన్ లో పాల్గొన్నారు.

- Advertisement -

ప్రపంచ కప్ లో పాల్గొనే మొత్తం 10 జట్ల కెప్లెన్లు ఒక్కొక్కరూ ఒక్కోలా పోజిచ్చిన ఫొటోలను ఐసీసీ తమ అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇక ప్రపంచ కప్ మెగా టోర్నీ ఈ నెల 30న అట్టహాసంగా ప్రారంభం కానుంది. టీమిండియా మొట్టమొదటి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో పోటీ పడనుంది.

Leave A Reply

Your email address will not be published.