News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఏకగ్రీవంగా తీర్మానించిన సీడబ్ల్యూసీ ..!

ఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సోనియాగాంధీ నే పగ్గాలు చేపట్టాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. రాహుల్‌గాంధీ స్థానంలో ఆమెనే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని వర్కింగ్‌ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేననీ, పార్టీకి అన్ని స్థాయుల్లో ఎన్నికలు జరిపి, అధ్యక్ష ఎన్నికలు కూడా పూర్తి చేసి ఆమె వైదొలుగుతారని పార్టీప్రకటించింది. గాంధీ కుటుంబం మినహా వేరెవ్వరినీ ఆ పదవి లో నియమించడం సాధ్యంకాదని పార్టీ వర్గాలు తేల్చిచెప్పాయి. అనారోగ్య కారణాలతో సోనియా విముఖంగా ఉన్నప్పటికీ .. పార్టీని మళ్లీ గాడిన పెట్టేందుకు తగిన వ్యవస్థను నిర్మించాల్సి ఉందని .. కాబట్టి సోనియా తప్పా వేరే ప్రత్యామ్నాయం లేదని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ చేసిన రాజీనామాను కమిటీ లాంఛనంగా ఆమోదించింది.

Sonia gandhi

- Advertisement -

19 ఏళ్ల పాటు అధ్యక్షురాలిగా కొనసాగిన సోనియా 20 నెలల కింద రాహుల్ కు పగ్గాలు అందజెప్పారు. పార్టీకి రాహుల్‌ చేసిన సేవలను కొనియాడుతూ సీడబ్ల్యూసీ కమిటీ తీర్మానం చేసింది. సోనియాను తాత్కాలిక చీఫ్‌గా నియమిస్తూ మరో తీర్మానం .. కశ్మీర్‌పై వాస్తవాలు వెల్లడించాలని ఇంకొక తీర్మానం ఆమోదించినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా మీడియాకుచెప్పారు. శనివారం ఉదయం 11 గంటలకు సీనియర్‌ నేతలంతా ఏఐసీసీ కార్యాలయంలో సమావేశమై చివరిసారిగా రాహుల్‌కు నచ్చచెప్పజూశారు. కానీ ఆయన భీష్మించడంతో నేతలంతా ఐదు జోన్లుగా విభజించుకుని బృందాలుగా సమావేశమయ్యారు. దక్షిణాది బృందాన్ని మన్మోహన్‌సింగ్‌, ఉత్తర భారత బృందాన్ని ప్రియాంక వాద్రా, ఈశాన్యాన్ని అంబికా సోని నడిపించారు. ఈ చర్చలకు దూరంగా ఉంటామంటూ రాహుల్‌, సోనియా ఏఐసీసీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. చర్చల్లో పాల్గొన్న ప్రియాంక కూడా పగ్గాలు చేపట్టేందుకు విముఖత చూపారు. తనను ఈ చర్చలోకి లాగొ ద్దని .. తాను ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాదల్చుకున్నానని తేల్చిచెప్పారు. అన్ని ప్రత్యామ్నాయాలు పరిశీలించాక .. సోనియా తప్పా వేరే మార్గం లేదని మళ్ళీ సోనియాగాంధీ కె పార్టీ పగ్గాలు అప్పజెప్పింది సీడబ్ల్యూసీ. కాగా రాహుల్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని తెలంగాణ,ఏపీ రాష్ట్రాల నాయకులు విజ్ఞప్తి చేశారు.

Sonia gandhi

Leave A Reply

Your email address will not be published.