News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఏపీపై ఈసీ వివక్ష

తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంటర్‌ పరీక్షలపై తెలంగాణ సీఎం సమీక్ష పెడితే ఎవరూ నోరు మెదపలేదన్న ఆయన. ఇక్కడ తాము ఏదైనా సమీక్ష పెడితే మాత్రం గగ్గొలు పెడుతున్నారని మండిపడ్డారు. ఈసీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పాలన అస్తవ్యస్తం అవుతుందని చంద్రబాబు అన్నారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు. స్థానిక సంస్థల సిద్దంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారం కోసం ప్రతిపక్షం ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేసిందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అయినప్పటికీ అన్నింటినీ సమర్థంగా ఎదుర్కున్నామని చెప్పారు. ప్రజాస్వామ్యం కోసం తాము చేసే పోరాటం అందరిలో స్ఫూర్తి నింపుతోందన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసి.. ఎంత దుష్ర్పచారం చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీనే అని చంద్రబాబు చేశారు. ఇక ఈవీఎంలపై తమ పోరాటం ఈరోజుది కాదన్న ఆయన.. ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి వచ్చేవని.. సార్వత్రిక ఎన్నికలు అవ్వగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్పారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.