News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ఏ చట్టం ప్రకారం కూలుస్తారు

ఒకసారి పరిరక్షణ కట్టడాల పరిధిలోకి వచ్చాక వాటిని ఏవిధంగా తొలగిస్తారని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం అక్కడున్న పురాతన భవనాలను కూల్చివేసే అంశంపై గతంలో పలువురు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్రమంజిల్‌లో ప్రస్తుతం ఉన్న భవనాలు చారిత్రక కట్టడాలని, నిజాం వారసులు నిర్మించిన పురాతన కట్టడాలను కూల్చివేయడానికి వీల్లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది విదించారు. ఆ భవనాలు చారిత్రక పరిరక్షణ కట్టడాల పరిధిలోకే వస్తాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి అవసరం లేకపోయినా నూతనంగా అసెంబ్లీ భవనాలను నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని, దీంతో ప్రజాధనం కూడా దుర్వినియోగం అవుతోందని పిటీషనర్ల తరపు న్యాయవాది ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవనం అవసరాలకు సరిపోవడం లేదని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు వాదనలు వినిపించారు. భదత్రాపరంగానూ అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే నిపుణుల సూచనలతో కొత్త భవన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న విధాన పరమైన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని అడ్వకేట్‌ జనరల్‌ పేర్కొన్నారు. దీనిపై జోక్యం చేసుకున్న హైకోర్టు.. చారిత్రక కట్టడాల్ని కాపాడాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి కదా అని వ్యాఖ్యానించింది. ఏ ప్రాతిపదికన ఆ భవనాలు కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించిందో చెప్పాలని కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నించింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని.. ప్రభుత్వం కూడా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని వ్యాఖ్యానించింది. దీనిపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.