News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కాంగ్రెస్ లో మున్సిపల్ సందడి ..!

తెలంగాణ కాంగ్రెస్  మున్సిపల్ ఎలక్షన్స్ పై సీరియ‌స్ గా దృష్టి పెడుతోంది. ఈ పుర‌పాల‌క ఎన్నిక‌ల్లో సత్తా చాటేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది.  ఇప్ప‌టికే  రంగంలోకి దిగిన పీసీసీ నియ‌మించిన త్రిస‌భ్య క‌మిటీ ..  జిల్లాల వారిగా మున్సిపాలిటీల్లో పార్టీ పరిస్థితులు .. తీసుకోవాల్సిన జాగ్రత్తలు .. అమలు చెయ్యాల్సిన తక్షణ నిర్ణయాలపై సీరియ‌స్ గా ఫోక‌స్ పెడుతున్నారు.  ఈ ఎన్నికల్లో అమలుచెయ్యాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో  .. సంపత్ కుమార్,వంశీ చంద్ సభ్యులుగా  ఉన్న త్రిమెన్ కమిటీ గాంధీభ‌వ‌న్ లో స‌మావేశ‌మైయ్యింది. ఇప్పటికే మున్సిపాలిటీల వారీగా విడివిడిగా స్థానిక నేతలతో మాట్లాడుతున్న  త్రిమెన్ క‌మిటీ నేతలు  .. అక్కడి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణలు పెద్దపీట వేస్తూనే .. గెలుపు ప్రాతిపదికన ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

congress
ఈ ఎన్నిక‌ల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీలతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ లు ఇందులో కీలకం కానున్నారు. ఎమ్మెల్యేలు లేని చోట  ప్ర‌త్యేకంగా ఇంచార్జీల నియామ‌కం చేయ‌నున్నారు. మున్సిప‌ల్ వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు జరుగుతున్న తీరుపై నిప్పులు చెరుగుతున్న కాంగ్రెస్ నేత‌లు .. ఇందులోపెద్ద రాజ‌కీయ కుట్ర జ‌రుగుతోంద‌ని ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ వార్డుల పున‌ర్వ‌భ‌జ‌న‌పై వ‌స్తున్న వినతుల కోసం గడువు ను పెంచాలంటున్నారు కాంగ్రెస్ నేత‌లు. పార్టీ స్థానిక నాయకులు సమన్వయం తో పనిచేయాల‌ని పిలుపునిస్తూ .. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిని అంశాల‌ను బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ళాల‌ని కోరుతున్నారు. మిషన్ భగీరథ లో జరిగిన అవినీతిని, ఇప్పటి వరకు జరిగిన పనిని ప్రజలకు వివరించి మ‌ద్దతు కూడ‌గ‌ట్టాల‌ని సూచిస్తున్నారు. ఇక గురువారం నాటికి అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలను ముగించి .. 5 నుంచి పదో తేదీలోపు పురపాలక సంఘాల వారీగా సమావేశాలను పూర్తి చేయాల‌ని క్షేత్ర‌స్థాయి క్యాడ‌ర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు.

- Advertisement -

congress

Leave A Reply

Your email address will not be published.