News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేంద్ర నిఘానీడలో టీఆర్ఏఎస్ ఎమ్మెల్యేలు ..!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు బీజేపీ రూపంలో ముప్పు పొంచివుందా .. గులాబీ ఎమ్మెల్యేలంతా కేంద్ర నిఘానీడలో ఉన్నారా .. టీఆర్ఎస్ లోని ఓ ముఖ్యనేతతో రామ్ మాధవ్ రహస్యంగా భేటి అయ్యారా .. రాబోయే రోజుల్లో గులాబీ కోటలో ముసలం తప్పదా .. ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధనమిస్తున్నాయి జరుగుతున్న పరిణామాలు. ఇంతకీ కేసీఆర్ సర్కార్ పై కాషాయ దండు యాక్షన్ ప్లాన్ ఏమిటనే వివరాల్లోకి వెళితే ..

Bjp target trs

టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు .. ఎమ్మెల్యేల అసంతృప్తులను పావులుగా చేసుకొని బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు చక చక పావులు కదుపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల లొసుగులు చిట్టానంత కేంద్ర నిఘా సంస్థలు సేకరించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇటీవల కేంద్ర నిఘా సంస్థకు చెందిన పలువురు అధికారులు హైదరాబాద్ లోని ఓ ప్రవేట్ హోటల్ లో గెట్ టూ గెదర్ ఏర్పాటు చేసుకున్నారట. అది అధికారిక భేటి కానప్పటికీ .. అందులో గులాబీ ఎమ్మెల్యేల ఆర్థిక లావాదేవీలు .. ఆస్తుల చట్టాలకు సంబంధించిన వివరాలు .. కేంద్రానికి అందిస్తున్న నివేదికకు సంబంధించిన చర్చ జరిగిందట. ఈ భేటీలో జరిగిన చర్చ ప్రకారం టీఆర్ఎస్ ఎమ్మెలందరిపైనా కేంద్ర నిఘానేత్రం ఉందని స్పష్టమౌతోంది. సో .. అవసరాన్ని బట్టి కేంద్రం ఈ ఆయుధాన్ని బయటికి తీసి అవకాశం ఉంది.

- Advertisement -

Bjp target trs

ఇదిలా ఉంచితే .. గతనెల అంటే జూన్ నెలలో టీఆర్ఎస్ లోని ఓ ప్రముఖ నాయకుడి బర్త్ డే వేడుకలు గోవాలో జరిగాయట. ఆ వేడుకలకు దాదాపు 36 మంది ఎమ్మెల్యేలు అత్యంత రహస్యంగా హాజరైయ్యారని సమాచారం. వీరంతా ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో పెద్ద స్పెషల్ ఏముంది అనుకుంతున్నారా .. అక్కడికే వస్తున్నా . సదరు నాయకుడి జన్మదిన వేడుకల రూపంలో జరిగిన ఈభేటీకి బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ హాజరు కావడం విశేషం. ఎమ్మెల్యేలతో రామ్ మాధవ్ వన్ టూ వన్ మాట్లాడక పోయినా .. ముఖ్యనేతతో మాత్రం రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే .. రాబోయే రోజుల్లో గులాబీ కోటలో ముసలం తప్పదేమో అనే సంకేతాలనిస్తున్నాయి.

Bjp target trs

Leave A Reply

Your email address will not be published.