News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసిఆర్ హరీష్ ను పక్కనపెట్టడానికి కారణం ఇదేనా

హైదరాబాద్ : తెలంగాణ రాజ‌కీయాల చ‌ర్చ అంతా ఇప్పుడు మాజీ మంత్రి హ‌రీశ్‌రావు చుట్టూ జ‌రుగుతోంది. హ‌రీశ్‌రావును టీఆర్ఎస్ ప‌క్క‌న‌పెట్టింద‌ని, కేసీఆర్ హ‌రీశ్‌రావును అవ‌మానిస్తున్నార‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్రారంభోత్స‌వంలో హ‌రీశ్ క‌నిపించ‌క‌పోవ‌డం వెనుక కార‌ణాలు వెదుకుతూ ఈ ప్రచారం మరింత ఎక్కువ అయ్యాయి.

Kcr

అయితే కేసీఆర్ నిజంగానే హరీష్ రావును పక్కన పెడుతున్నారా .. లేక దీంట్లో రాజకీయ కారణాలేమైనా ఉన్నాయా అనే చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవ‌ల టీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు లింక్ పెడుతూ ఈ చర్చలో సరికొత్త అంశాలను చర్చలోకి తీసుకొస్తున్నారు. త‌మిళ‌నాడు త‌ర‌హా రాజ‌కీయాలు తెలంగాణ‌లోనూ రావాల‌ని కేసీఆర్ ఈ స‌మావేశంలో అభిప్రాయ‌ప‌డ్డారు. అంటే రెండు ప్రాంతీయ పార్టీలే ఉండాలి త‌ప్పితే జాతీయ పార్టీలు ప్ర‌భావం రాష్ట్రంలో ఉండ‌వ‌ద్ద‌నేది కేసీఆర్ మాట‌ల్లో ఆంత‌ర్యం అంటున్నారు.

Kcr

- Advertisement -

అందుకే హ‌రీశ్‌రావును దూరం పెడుతూ .. ఆయ‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరిగేలా చేస్తున్నార‌నే విశ్లేషణలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. హరీశ్‌రావుపై సానుభూతి పెరిగాక ఆయ‌న టీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు పంపి ఆయన చేత ఓ ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయించేలా కేసీఆర్ ప్లాన్ అంటున్నారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఒక ప్ర‌త్యామ్నాయ పార్టీ ఆవ‌శ్య‌క‌త ఉందని కేసీఆర్ భావిస్తున్నారు.

Kcr

ఈ నేపథ్యంలో .. ఇతరులకు ఆ అవకాశం ఇవ్వకుండా .. తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఇమేజ్ ఉన్న హరీష్ రావును బయటికి పంపి ఆయన చేత పార్టీ పెట్టించాలని గులాబీ బాస్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే హరీష్ రావును కావాల‌నే దూరం పెడుతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మరి కల్వకుంట్ల అంతర్గత కుటుంబ రాజకీయ వ్యూహాలు ఏమేరకు పాలిస్తాయో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.