News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్ బీజేపీ-ఎంఐఎంల‌కు సమన్వయకర్త ..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒక చేతితో ఎంఐఎంను .. మరో చేతితో బీజేపీని మోస్తూ రెండింటికీ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు ఎలాంటి సహకారం అందించలేదంటున్న కేసీఆర్ .. రాజ్యసభలో సమాచార హక్కు చట్ట సవరణ బిల్లుకు ఎందుకు మద్దతు తెలిపారో ప్ర‌జ‌ల‌కు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయ‌న .. హరితహారం కార్యక్రమంలో భాగంగా డీల్లీలో కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్‌ కలిసి మొక్కలు నాటారంటే వాళ్ల బంధం  ఎంత దృఢమైనదో అర్థమవుతోందన్నారు.

- Advertisement -

Tags:REVANTHREDDY,KCR,MIM,BJP,CONGRESS,UTTAMKUMARREDDY,JANAREDDY,TRS,BJP,MIM,CONGRESS,TELANGANA BHAVAN,GANDHIBHAVAN,TRS BHAVAN

Leave A Reply

Your email address will not be published.