News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కేసీఆర్ రాచ‌రిక‌పు నిరంకుశ‌పు పాల‌నలో బీసీల‌కు అన్యాయం ..!

హైద‌రాబాద్ : కేసీఆర్ పాల‌న‌లో రాష్ట్రంలో బీసీల‌కు అన్ని విధాలుగా అన్యాయం జ‌రుగుతోంద‌ని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఇది మ‌రో సారి రుజువైయ్యింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఎంపీటీసీ .. జెడ్పీటీసీ టికెట్ల కేటాయింపులో చాలా జిల్లాల్లో బీసీలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాచ‌రిక‌పు నిరంకుశ‌పు పాల‌న సాగిస్తున్నార‌న్న ఉత్త‌మ్ .. బీసీలంటే .. కేసీఆర్ కు చిన్న చూపు అన్నారు. రాష్ట్రంలో బీసీ లెక్క‌ల‌ను తేల్చాల‌ని కోర్ట్ ఆదేశించినా కేసీఆర్ ప‌ట్టించుకోక‌పోవ‌డం స‌రికాద‌న్నారు.

BC ALL PARTY MEETING

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల తగ్గింపు అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ లో జ‌రిగిన అఖిలపక్ష సమావేశంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ స‌మావేశానికి కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయతో పాలు ఇత‌ర పార్టీల నాయ‌కులు పాల్గొన్నారు.  రాష్ట్రంలో కేసీఆర్ .. టీఆర్ఎస్ ల‌ను  బీసీలు క్షమించరని స‌మావేశంలో పాల్గొన్న నాయ‌కులు ముక్త‌కంఠంతో నిన‌దించారు. బీసీల ఓట్లతో గెలిచి ఇప్పుడు బీసీలకు అన్యాయం చేయడం తగదని హితవు పలికారు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్. లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని అఖిల ప‌క్షం నేత‌లు డిమాండ్ చేశారు.

BC ALL PARTY MEETING

Leave A Reply

Your email address will not be published.