News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోండి

రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఏఐసిసి అధ్యక్షులు రాహూల్ గాంధీ మరోసారి స్పష్టం చేశారు. ఇక తాను కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిని కాదని, సాధ్యమైనంత త్వరగా పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని రాహుల్ చెప్పారు. పార్టీ ఇంకా ఆలస్యం చేయకుండా కొత్త అధ్యక్షుడిపై నిర్ణయం తీసుకోవాలని రాహూల్ సూచించారు. ఐతే ఆ ప్రక్రియలో తాను పాలుపంచుకోనని ఆయన చెప్పారు. ఎందుకంటే తాను ఇప్పటికే ఆ పదవికి రాజీనామా చేశానని.. ఇప్పుడు తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ వీలైనంత త్వరగా సమావేశమైన కొత్త ఏఐసిసి అధ్యక్షుడిని ఎన్నుకోవాలని రాహుల్‌ గాంధీ సూచించారు.

 

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.