News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

గుండెెపోటుతో సుష్మాస్వరాజ్ మృతి

బీజేపీ సీనియర్‌ నేత..విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ (67) ఇక లేరు. మంగళవారం రాత్రి గుండె పోటుతో ఆమె మరణించారు. రాత్రి 10 గంటల సమయంలో ఆమె తనకు నలతగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఐదుగురు వైద్యులతో కూడిన బృందం ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు అత్యవసర చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారని ఎయిమ్స్‌ వైద్యులు తెలిపారు. సుష్మను ఎయిమ్స్‌కు తరలించిన విషయం తెలియగానే కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, హర్షవర్ధన్‌, ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా అక్కడికి వెళ్లారు.

sushmaswaraj

- Advertisement -

సుష్మాస్వరాజ్‌ మరణవార్త తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. సుష్మాస్వరాజ్‌ మృతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె మరణంతో భారత రాజకీయాల్లో ఓ గొప్ప అధ్యాయానికి తెరపడిందని అన్నారు.  పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుపోయే గొప్ప పార్లమెంటేరియన్‌ సుష్మాస్వరాజ్‌ అని కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ అన్నారు. ఆమె ఇక లేరనే విషయం తెలిసి చాలా బాధ కలిగిందని ఆయన చెప్పారు. సుష్మాస్వరాజ్‌ మృతి బీజేపీకి, దేశ రాజకీయాలకు తీరని లోటని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షా అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలందరి తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. పీసిసి అధ్యక్షులు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సుష్మ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సుష్మాస్వరాజ్‌ మృతిపట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్,కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం ప్రకటించారు.

sushma swaraj

Leave A Reply

Your email address will not be published.