News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

గేమ్ ఓవర్ సినిమా రివ్యూ

సినిమా- గేమ్ ఓవర్
తారాగణం- తాప్సి, వినోదిని వైద్యనాథ‌న్‌, అనీష్ కురువిల్లా, సంచిత న‌ట‌రాజ‌న్‌, ర‌మ్య సుబ్రహ్మణ్యన్‌ త‌దిత‌రులు
మ్యూజిక్- రోన్ ఏతాన్ యోహాన్
మాటలు- వెంకట్ కాచర్ల
నిర్మాత- ఎస్.శశికాంత్
దర్శకత్వం- అశ్విన్ శరవణన్

పరిచయం………..
అందాల భామ తాప్సీ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమే. ఆమె పలు దక్షిణాదీ సినిమాల్లో నటించి మంచి పేరే తెచ్చుకుంది. ఐతే ఈ మధ్య  హిందీలో చాలా సినిమాల్లో నటిస్తోంది తాప్సీ. న‌ట‌న‌కి ప్రాధాన్యమున్న సినిమాల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ప్రత్యేక‌మైన గుర్తింపుని తెచ్చుకుంటోంది. అటు హిందీ సినిమాలు చేస్తూనే.. దక్షిణాది బాషల్లోను.. అందులోను లుగులో క్రమం త‌ప్పకుండా ఏడాదికో సినిమా అయినా చేస్తోంది తాప్సీ. తాజాగా తాప్సీ నటించిన గేమ్ ఓవ‌ర్ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో చూసేద్దామా..

game over
గేమ్ ఓవర్ కధ……
ఇక సినిమా కధలోకి వెళ్తే స్వప్న (తాప్సి) ప్రముఖ వీడియో గేమ్ డిజైన‌ర్‌ గా పనిచేస్తుంటుంది. వీడియో గేమ్స్ తయారు చేయడమే కాదు.. ఆ గేమ్స్ ఆడ‌టమన్నా ఆమెకు చాలా ఇష్టం. ఈ క్రమంలో అనుకోకుండా స్వప్న జీవితంలో ఓ సంఘ‌ట‌న చోటు జరుగుతుంది. అదిగో అప్పట్నుంచి చీకటంటేనే స్వప్న వణికిపోతుందు. ఉద్యోగ రిత్యా స్వప్న త‌ల్లిదండ్రుల‌కి దూరంగా, ప‌ని మనిషి క‌ళ‌మ్మ (వినోదిని వైద్యనాథ‌న్‌)తో క‌లిసి ఓ అద్దే ఇంట్లో ఉంటుంది. అనుకోకుండా స్వప్న త‌న చేతికి ఓ ప‌చ్చబొట్టు వేయించుకుంటుంది. ఆ ప‌చ్చబొట్టు రంగులో అమృత (సంచిత న‌ట‌రాజ‌న్‌) అస్తిక‌లు కూడా క‌లుస్తాయన్న మాట. ఇంతకీ ఈ ప‌చ్చబొట్టు స్వప్నను ఎలా ప్రభావితం చేసింది.. అసలు అమృత ఎవ‌రు.. ఆమె ఎలా మరిణించింది.. అమృత త‌ర‌హాలోనే స్వప్నకి కొన్ని వింత ఘ‌ట‌న‌లు ఎదురైన‌ప్పుడు వాటిని ఎలా అదిగమించింది.. ఇలాంటి విషయాలు తెలియాలంటే మాత్రం గేమ్ ఓవర్ సినిమా చూడాల్సిందే…
game over

ఎలా ఉందో తెలుసా………
గేమ్ ఓవర్ ఓ విభిన్నమైన క్రైం కం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అని చెప్పవచ్చు. ఉత్కంఠతో కూడిన కధను.. కాస్త సాగదీసి సస్పెన్స్ కధనంగా రూపొందించాడు డైరెక్టర్. సినిమాలో ఒక ఆత్మ క‌థ‌తో పాటు… సీరియ‌ల్ కిల్లర్స్ నేప‌థ్యాన్ని, మానసిక ప‌ర‌మైన సంఘ‌ట‌న‌ల్ని టచ్ చేసిన విధానం ప్రేక్షకులను ఆక‌ట్టుకుంటుంది. క‌థ ప్రారంభమవ్వగానే ప్రేక్షకుడిని ఓ ట్రాన్స్ లోకి తీసుకెళ్తాడు డైరెక్టర్. ఇదిగో ఈ క్రమంలో కొన్ని స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపించక మానదు. అయినా ఆ త‌ర్వాత క‌థ‌నం ఆకస్తికరంగా మారడంతో ఆకట్టుకుంటుంది. కధలో ముందు ముందు ఏంజరగబోతోందన్న ఉత్కంఠ ఆసక్తిని రేపుతుంది. సాధారనంగా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ట్విస్టుల వెన‌క సంఘ‌ట‌న‌లు చివ‌రి వ‌ర‌కుగానీ తెలియవు. కానీ ఈ సినిమాలో కీల‌క‌మైన మ‌లుపుల వెన‌క సంఘ‌ట‌న‌ల్ని ముందుగానే బ‌య‌టపెట్టాడు ద‌ర్శకుడు.

- Advertisement -

అయినప్పటికీ చివ‌రి వ‌ర‌కు ఉత్కంఠని రేకెత్తిస్తూ స‌న్నివేశాల్ని కాస్త కొత్తగా తీర్చిదిద్దాడు. సాధారనంగానే ఇలాంటి క్రైం ధ్రిల్లర్ సినిమాలు లాజిక్‌ల‌కి అతీతంగా సాగుతుంటాయి. కధలో భాగంగా అమృత‌ని చంపిన సైకో కిల్లర్లే స్వప్న ద‌గ్గరికి ఎలా వ‌చ్చారనే ప్రశ్న మొద‌లుకొని.. హీరోయిన్ కు ముందుగానే క‌ల‌లు వ‌చ్చే తీరు, క‌ర‌డుగ‌ట్టిన సైకో కిల్లర్లు ఒక వీల్‌ఛైర్‌లో కూర్చున్న అమ్మాయి చేతిలో మ‌రణించే వైనం వాస్తవానికి చాలా దూరంగా అనిపిస్తాయి. ఐతే అవన్నీ నిజం అని  న‌మ్మేలా కధ నడిపించడంలో ద‌ర్శకుడు విజ‌య‌వంత‌మ‌య్యాడని చెప్పవచ్చు. కానీ ఆ సైకో కిల్లర్లు ఎవ‌రు.. ఎందుకు చంపుతున్నాడనే విష‌యాన్ని మాత్రం కధలో చెప్పలేదు. అందుకే ప్రేక్షకుడు కాస్త అర్దం కాక తెల్లమొహం వేస్తాడు.
game over

అంతా ఇలా చేశారు…
అందాల భామ తాప్సి న‌ట‌న ఈ సినిమాకే హైలెట్ అని చెప్పవచ్చు. సినిమా మొత్తం తాప్సీ చుట్టూనే తిరుగుతుంది. చ‌క్కటి సహజమైన నటనతో పాత్రలో స‌హ‌జంగా ఒదిగిపోయింది. న‌ట‌న‌లో తాప్సి ప‌రిణ‌తిని చాటి చెప్పే సినిమా ఇంది. ఈ సినిమాలో చాలా ప‌రిమిత‌మైన పాత్రలే క‌నిపిస్తాయి. ఇక పని మనిషి పాత్రలో వినోదిని వైద్యనాథ‌న్ చ‌క్కటి అభిన‌యం ప్రద‌ర్శించింది. అమృత అనే అమ్మాయిగా సంచిత నటించింది కొన్ని సీన్స్ లోనే అయినా.. ఆమె కూడా ఆక‌ట్టుకుంటుందనే చెప్పాలి. సాంకేతిక పరంగా చూస్తే సినిమా ఉన్నతంగా ఉందని చెప్పవచ్చు.  మొత్తంగా చూస్తే కమర్షియల్ సినిమాల్లోని తాప్సీని ఉహించుకుని ఈ సినిమాకు వెళ్తే మాత్రం నిరాశ తప్పదు.

నోట్.. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం.

Leave A Reply

Your email address will not be published.