News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

గ్రేటర్ లో ఇచ్చిన హామీలను గాలికొదిలిన టీఆర్ఎస్ ..!

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్ఎస్ పాలనలో రోడ్ల దుస్థితిపై కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు.గ్రేటర్ హైదరాబాద్ లో రోడ్ల దుస్థితి ఎలా ఉందో… ఈ రోడ్ల మీద ప్రయాణించిన చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారంటూ .. కాంగ్రెస్ నేతలు రోడ్ల దుస్థితిపై ధ్వజమెతున్నారు. హైదరాబాద్ రోడ్ల దుస్థితి పై వినూత్న రీతిలో నిరసన చేపట్టిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ సెల్ నాయకులు .. రోడ్లపై ఉన్న గుంతల్లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటోలను ఉంచారు.

Roads

రోడ్లు దారుణంగా పాడైపోయినా ముఖ్యమంత్రి, ఆయన తనయుడు ఇద్దరూ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పాడైపోయిన రోడ్లను చూసేందుకు ముఖ్యమంత్రికి సమయం లేదని దుయ్యబటడుతున్నారు. డిసెంబర్ 2018 వరకూ పురపాలక శాఖ బాధ్యతలు చేపట్టిన మాజీ మంత్రి కేటీఆర్ కు రాజకీయ కార్యకలాపాలతో జనాన్ని పట్టించుకునే తీరికలేదంటూ కాంగ్రెస్  నేతలు విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ తాను నివాసం ఉంటున్న ప్రగతి భవన్ లాగా రాష్ట్రం అంతా ఉందని భ్రమపడుతున్నారని .. ఒకసారి వచ్చి రోడ్లపై తిరిగితే జనం పడుతున్న అవస్థలేంటో అర్థం అవుతాయని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. వివిధ సమస్యలను ట్విట్టర్లో ప్రస్తావిస్తే వెంటనే స్పందించే కేటీఆర్ రోడ్లను ఒకసారి చూస్తే వాటి సొగసు ఎలా వుందో అర్థం అవుతుందన్నారు.

- Advertisement -

Roads

జీహెచ్ఎంసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సిటీ నాయకుల ఆరోపణ. రోజురోజుకీ ప్రమాదాలు పెరిగిపోతున్నా అధికారుల్లో చలనం లేదని .. తామేదో రాజకీయ ప్రయోజనాల కోసం నిరసన తెలపడం లేదని .. గుంతలు పడిన రోడ్ల కారణంగా జనం అనేక అవస్థలు పడుతున్నా మంత్రులకు .. ఎమ్మెల్యేలకు చీమకుట్టినట్టుగా కూడా లేనందున వారి దృష్టికి తీసుకొచ్చేందుకు తమ ఈ ప్రయత్నమంతున్నారు హస్తం నాయకులు.

Roads

Leave A Reply

Your email address will not be published.