News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

చంద్రబాబు పై వర్మ సంచలన ట్వీట్ ..

అమరావతి : వివాదాస్పద దర్శకుడు వర్మ నిరంతరం ఏదో ఒక విధంగా వార్తలో ఉంటాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్మ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టేస్తుంటాడు. మొదట మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వచ్చిన వర్మ క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ ను తిట్టమని శ్రీరెడ్డికి నేనే చెప్పానని వర్మ చెప్పడం పలు సంచలనాలకు దారి తీసింది. ఎన్ని విమర్శలు ఎదురైనా, కోర్టు కేసులు ఎదురుకున్నా వర్మ ఏ మాత్రం మారలేదు.

RGV

ఖచ్చితంగా చెప్పాలంటే భయపడితే వర్మ ఎందుకు అవుతాడు. అలాంటి వర్మ బారిన ఈ మధ్య కాలంలో ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు పడ్డారు. ఎన్నికల ముందే చంద్రబాబును ఓ రేంజ్ లో విమర్శించిన వర్మ ఎన్నికల తరువాత కూడా సెటైర్లు వేయడం ఆపలేదు. తాజాగా టీడీపీ నుండి నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్మ తన ట్వీట్స్ తో చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే చంద్రబాబు నాయుడు దాన్ని చంపేశాడంటూ టార్గెట్ చేశారు.

- Advertisement -

RGV

నాడు ఎన్టీఆర్ అమెరికా వెళితే నాదెండ్ల భాస్కర్ రావు కుట్ర చేస్తే .. ఇప్పుడు చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళితే టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరి చరిత్రను మరోసారి పునరావృతం చేశారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతుంటే ఆయన డైలాగులకు నవ్వుతున్న జగన్ కు .. బాబులో బ్రాహ్మనందం కనిపిస్తున్నాడని .. అసెంబ్లీలో బాబు బ్రహ్మానందమేనని వర్మ ట్విట్టర్ లో సెటైర్లు వేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు వర్మపై మండిపడుతున్నారు. ఎన్టీఆర్ జీవిత కథ లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమాని ఏపీలో విడుదలకు చంద్రబాబు అడ్డుపడ్డాడనే ఉద్దేశంతోనే వర్మ ఇలా చేస్తున్నాడని వారు గుర్తు చేస్తున్నారు.

RGV

Leave A Reply

Your email address will not be published.