News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోంది

మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు త్యాగాలను బీజేపీ నేతలు తక్కువ చేసి చూపాలని ప్రయత్నిస్తున్నారని పీసిసి చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నెహ్రు చేసిన త్యాగాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. చరిత్రను బీజేపీ వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారంతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తోంది ఉత్తమ్ మండిపడ్డారు. స్వయంగా హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో నెహ్రూను విమర్శిస్తూ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ నేతలు చరిత్రను తప్పుగా ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఉత్తమ్ ఫైర్ అయ్యారు.

uttam

- Advertisement -

క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ ఆవరణలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వంశీచంద్‌ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 20న రాజీవ్ గాంధీ 75వ జయంతి వేడుకలు గ్రామ గ్రామాన పెద్దఎత్తున చేయాలని పార్టీ క్యాడర్ కు ఉత్తమ్ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.