News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

జగన్ కు రివర్స్ కొడుతున్న రివర్స్ టెండరింగ్ ..!

పోల‌వ‌రం ప్రాజెక్ట్ స‌హా వివిధ ప్రాజెక్టు, పీపీఏల ఒప్పందాల్లో అవినీతి జ‌రిగింద‌ని భావించిన ఏపీ సీఎం జ‌గ‌న్ వాటిపై రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానాన్ని అవ‌లంభించాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే జ‌గ‌న్ తీసుకున్న ఈ రివ‌ర్స్ టెండ‌రింగ్ .. ఆయ‌న‌కు రివ‌ర్స్ కొడుతోంది. కానీ జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని .. ఇప్పటికే కేంద్ర ప్ర‌భుత్వం అభ్యంత‌రం తెలిపిన సంగతి తెలిపింది. స్వయంగా కేంద్రమంత్రి పోల‌వ‌రంలో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు త‌మ దృష్టికి రాలేద‌ని పార్లమెంటులో ప్రక‌టించారు. అయినా జ‌గ‌న్ వెన‌క్కు త‌గ్గకుండా న‌వ‌యుగ సంస్థను పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి త‌ప్పించారు. త్వ‌ర‌లో రివ‌ర్స్ టెండ‌రింగ్ కు వెళ్లాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం భావిస్తున్న త‌రుణంలో .. పోల‌వ‌రం ప్రాజెక్టు అథారిటీ జ‌గ‌న్ కు భారీ షాక్ ఇచ్చింది. కేవ‌లం సూచ‌న‌లు మాత్ర‌మే చేయ‌గ‌లిగే అధికారం ఉన్న ఈ క‌మిటీ ప్రాజెక్టుపై హైద‌రాబాద్ లో స‌మీక్ష జ‌రిపి .. న‌వ‌యుగ‌ సంస్థ ప‌నితీరు బాగానే ఉంద‌ని అథారిటీ చెప్పింది. అంతే కాదు రివ‌ర్స్ టెండ‌రింగ్ ద్వారా పోల‌వ‌రం వ్య‌యం మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌డంతో పాటు .. నిర్మాణం ఆల‌స్యం కావొచ్చ‌ని అథారిటి తేల్చింది. అథారిటీ ఇలా ప్రభుత్వ నిర్ణ‌యానికి వ్యతిరేకంగా చెప్పడం జ‌గ‌న్ కు గట్టి షాక్ అని చెప్పవ‌చ్చు.

Jagan

- Advertisement -

ఇక‌ పీపీఏల పున‌స‌మీక్ష చేయాల‌ని జ‌గన్ తీసుకున్న నిర్ణ‌యాల‌పైనా విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఇప్పటికే ఈ మేర‌కు జ‌గ‌న్ నిర్ణ‌యంపై కేంద్రం ప‌లుమార్లు అభ్యంత‌రం తెలిపాయి. అయినా జ‌గ‌న్ వెన‌క్కు త‌గ్గడం లేదు. తాజాగా జపాన్ ప్రభుత్వం సైతం జ‌పాన్ రాయ‌బారి చేత జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌డుతూ ఓ లేఖ రాసింది. ఇది జ‌గ‌న్ స‌ర్కారుకు మ‌రో ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. రాష్ట్ర‌వ్యాప్తంగా 25 శాతం కంటే త‌క్కువ జ‌రిగిన అభివృద్ధి .. నిర్మాణ ప‌నుల‌ను కూడా స‌ర్కార్ నిలిపివేసింది. వీటిపై కూడా రివ‌ర్స్ టెండ‌రింగ్ కు వెళ్లాల‌ని భావిస్తోంది. అయితే రివ‌ర్స్ టెండ‌రింగ్ పై మొండిగా ముందుకు వెళుతున్న జ‌గ‌న్ .. రివ‌ర్స్ టెండ‌రింగ్ .. పున‌స‌మీక్ష‌ల ద్వారా డ‌బ్బు మిగిల్చి వేగంగా ప‌నులు జ‌రిగేలా చూడక‌పోతే మ‌రిన్ని విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తోంది.

Jagan

Leave A Reply

Your email address will not be published.