News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

జన్మదిన శుభాకాంక్షలు

పీసిసి చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఉత్తమ్ బర్తడే సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లి.. మరిన్ని ఉన్న శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేటలో 1962 జూన్ 20 న జన్మించారు. ఉత్తమ్ తల్లిదండ్రులు పురుషోత్తం రెడ్డి, ఉషారాణ. అతని స్వగ్రామం సూర్యాపేట జిల్లాకు చెందిన తిరుమలగిరి మండలంలోని తాటిపాముల. ఉత్తమ్ కుమార్ రెడ్డి బియస్సీ చదివారు. భారత వైమానిక దళంలో కెప్టెన్ గా తన సేవలనందించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎం.ఐ.జి 21 మరియు ఎం.ఐ.జి 23 యుద్ద విమానాలను నడిపారు.

- Advertisement -

uttam
అంతే కాకుండా రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి విదేశీ ప్రయాణాలలో సెక్యూరిటీ ప్రోటోకాల్ కంట్రోలరుగా తన సేవలనందించారు. ఉత్తం కుమార్ రెడ్డి నాలుగు సార్లు శాసనసభకు, ఒక సారి లోక్ సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ లోక్ సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమైఖ్య ఆంద్రప్రదేశ్ లో కిరణ్ కమార్ రెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు. 2015 నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. పార్టీలో సీనియర్లతో పాటు నేతలందరిని కలుపుకుని.. సమర్ధవంతంగా పార్టీని నడిపిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.