News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

జమ్మూ కశ్మీర్ విభజన

జమ్ము కశ్మీర్‌కు సంబంధించి కీలకమైన ఆర్టికల్‌ 370 రద్దు , 35(ఏ) రద్దు , రాష్ట్ర విభజన అంశాలను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అదే సమయంలో ఆర్టికల్‌ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి వెంటనే ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో భారతరాజ్యాంగం పూర్తి  స్థాయిలో అమల్లోకి వస్తుంది. ఆర్టికల్‌ 370(3)తో జమ్ముకశ్మీర్‌ లెజిస్లేటీవ్‌ అసెంబ్లీగా మారుతుంది. దీంతో జమ్ముకశ్మీర్‌  అసెంబ్లీలో బిల్లులు రాష్ట్రపతి అమోదానికి పంపించే అవకాశం ఏర్పడింది. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఉమ్మడి జమ్ముకశ్మీర్‌ను జమ్ము-కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలుగా విభజించారు. వీటిల్లో జమ్ము-కశ్మీర్‌ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం కాగా.. లద్దాఖ్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించింది.

jammu

- Advertisement -

కశ్మీర్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. కశ్మీర్ కోసం చాలా మంది రాజకీయ నాయకులు, సైనికులు, పలువురు సామాన్యులు ప్రాణాలను అర్పించారని రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ చెప్పారు. వీరంతా భారత్‌తో కలిసి ఉండేందుకే ప్రాణాలు కోల్పోయారని.. ఇది దేశ చరిత్రలో ఓ చీకటి రోజుగా అభివర్ణించారాయన. కొందరి చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్న ఆజాద్.. రాజ్యాంగాన్ని దెబ్బతీసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని హత్య చేసిందని గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.