News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

టీఆర్ఏఎస్-బీజేపీ లపై సంపత్ సంచలన వాఖ్యలు ..!

హైద‌రాబాద్ : టీఆర్ఎస్-బీజేపీల‌పై సంచ‌ల‌న వాఖ్య‌లు చేశారు ఏఐసీసీ కార్య‌ద‌ర్శి .. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంప‌త్ కుమార్. తెలంగాణలో బీజేపీ,టీఆర్ఎస్ లు నపుంసక రాజకీయాలు చేస్తున్నాయని .. ఆ రెండు పార్టీల‌పై ఆయ‌న విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్ పైనా .. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పైనా బీజేపీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై సంప‌త్ ఘాటుగా స్పందించారు. లక్ష్మణ్ ఇంకో సారి కాంగ్రెస్ పై దిగ‌జారుడు విమర్శలు చేస్తే మా తడాఖా చూపించాల్సి వస్తుందని హెచ్చ‌రించారు. గాంధీభ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడిన సంప‌త్ .. బీజేపీ-టీఆర్ఎస్ ల‌వి లోపాయ‌కారి రాజ‌కీయాల‌ని దుయ్య‌బ‌ట్టారు. బీజేపీ కబంధ హస్తాలలో టీఆర్ఎస్ ఎంపీలు బందీ అయ్యారన్న సంప‌త్ .. టీఆర్ఎస్ ఎంపీలు ఒక్కరోజైనా రాష్ట్ర సమస్యలపై బీజేపీ సర్కార్ ను నిలదీశారా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ తన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు బీజేపీకి కేంద్రంలో బేషరటు మద్దతు ఇస్తున్నది నిజం కాదా అంటూ నిల‌దీశారు.

Sampath kumar

తెలంగాణలో కేసీఆర్ పాల‌న‌లో ప్రజాస్వామ్యం ఖునీ అవుతుందని ఇన్ని ఏళ్ళ తరువాత లక్ష్మణ్ కు గుర్తుకొచ్చిందా అని ఎద్దెవా చేసిన సంప‌త్ .. గత ఐదేళ్లలో లక్షన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ అరాచకాలు ఎందుకు కనపడలేదో చెప్పాల‌న్నారు. ల‌క్ష్మణ్ వి నపుంసక రాజకీయాలు కాదు అంటే .. కేసీఆర్ అవినీతిపై కేంద్ర సర్కార్ స్పందింపజేయాలన్నారు. కేసీఆర్ పై ఉన్న సీబీఐ కేసు .. నాయీమ్ కేసు .. కాళేశ్వరం అవినీతి .. ఇంటర్ అవకతవకలపై కేంద్ర సర్కార్ ఎందుకు స్పందించడం లేదో లక్ష్మణ్ చెప్పాలన్నారు.

- Advertisement -

Sampath kumar

రాష్ట్రంలో బీజేపీ వాపును చూసి ల‌క్ష్మ‌ణ్ బ‌లుపు అనుకుంటున్నాడ‌ని ఎద్దెవా చేసిన సంప‌త్ కుమార్ .. ఎంపీ పదవి కోసం బీజేపీ కి అమ్ముడు పోయిన డీకే అరుణ లక్ష్మణ్ అధ్య‌క్ష‌పదవికి ఎసరు పెడుతున్న విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని సూచించారు. అవకాశవాద రాజకీయాల కోసం కాంగ్రెస్ ను వీడిన ఉడతలుపట్టే నాయకులతో కాంగ్రెస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు సంప‌త్.

Leave A Reply

Your email address will not be published.