News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

తగ్గనున్న ఎల్ఆర్ఎస్ చార్జీలు..


అక్రమ ప్లాట్లు, అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు ముందుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు కొంత ఊరట లభించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. ఇందుకు సంబందించిన ఉత్తర్వులు ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్నాయి. ఈ విషయాన్ని ఐటీ, పురపాలక, పరిశ్రమల‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. పేద, మధ్య తరగతి వర్గాలపై ఆర్థిక భారం పడకుండా రిజిస్ట్రేషన్‌ నాటి మార్కెట్‌ విలువ ఆధారంగానే భూముల క్రమబద్ధీకరణ చేసే విధంగా జీవోను సవరించనున్నట్టు ఆయన ప్రకటించారు. అందుకు అనుగునంగా జీవో 131ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు. శాసన సభలో జీహెచ్‌ఎంసీ, పరిసర మునిసిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. ఎల్‌ఆర్‌ఎఎస్ పై ప్రభుత్వం పొరపాటుగా నిర్ణయం తీసుకుని ఉంటే, ఇప్పుడు సవరించుకునే ఆస్కారం ఉందంటూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలనే తీసుకుంటుందని, రిజిస్ట్రేషన్‌ సమయంలో ఉన్న ధర ప్రకారమే క్రమబద్ధీకరణ చార్జీలను వసూలు చేసేలా ఉత్తర్వులను సవరిస్తామని స్పష్టం చేశారు. దీంతో ఎల్ఆర్ఎస్ కోసం ధరఖాస్తు చేసుకునే వారికి కొంత మేర ఉరట లభించిందని చెప్పవచ్చు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.