News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

తలైవా క్రికెట్ మ్యాచ్

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ క్రికెట్ బ్యాట్‌ పట్టారు. ఆయన హీరోగా నటిస్తున్న దర్బార్‌ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. ఈ క్రమంలో రజనీకాంత్ సరదాగా చిత్రబృందంతో కలిసి కాసేపు క్రికెట్‌ ఆడారు. రజనీకాంత్ బ్యాటింగ్‌ చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ రజనీ అభిమానులు.. ఇది తలైవా ఐపీఎల్‌ మ్యాచ్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రజనీకాంత్ క్రికెట్ ఆడే సమయంలో నయనతార, కమెడియన్‌ యోగిబాబు కూడా ఉన్నారు. ఆట మధ్యలో అందాల భామ నయన్‌.. రజనీకాంత్ తో ఏవో కబుర్లు చెబుతూ కనిపించింది. ఇక ఈ సినిమాలో రజనీకాంత్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.