News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

తారక్ పక్కన ఇంగ్లీష్ సుందరి

ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక సినిమా ఆర్‌ ఆర్‌ ఆర్‌ కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ తేజ్ హీరోలుగా నటస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తుండగా.. చరణ్‌ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక రాం చరణ్‌ కు జోడీగా బాలీవుడ్‌ అందాల భామ ఆలియా భట్‌ ఎప్పుడో ఫిక్సయిపోయింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ అనే బ్రిటిష్‌ భామను ఎంపికచేసినా… కొన్ని పరిస్థితుల వల్ల ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఇక ఆమె స్థానంలో ఎవర్ని ఎంపిక చేయాలన్న విషయంలో రాజమౌళి తర్జనభర్జన పడుతూ వస్తున్నారు. చివరకు హాలీవుడ్‌ నటి ఎమ్మా రాబర్ట్స్‌ను ఎంపిక చేసుకోవాలని చిత్రబృందం భావిస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఐతే ఈ విషయంపై ఆర్‌ ఆర్ ఆర్‌ టీం స్పందించాల్సి ఉంది.

emma roberds

- Advertisement -

Tags: rrr movie, jr ntr, emma roberds, emma roberds with jr ntr, hollywood actress emma roberds, hollywood actress emma roberds with jr ntr

Leave A Reply

Your email address will not be published.