News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

తెలంగాణలో కరువు తాండవిస్తోంది

రాష్ట్రంలో కరువు తాండవిస్తూ.. 450మండలాలు కరవు కోరల్లో చిక్కుకుంటె.. సీఎం కేసీఆర్ మాత్రం ఎన్నికలు తప్ప మరో ధ్యాస లేదంన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. ఇప్పటి వరకు సీజనల్ రివ్యూ మీటింగ్ లు ఈ ప్రభుత్వంలో నిర్వహించిన ధాఖలాలు లేవని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో డీలిమిటేషన్ తప్పుల తడకగా ఉందని ఫైర్ అయ్యారు. కనీసం ఒక వారం పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి.. కరవు, విధ్యా, వైద్యంపై చర్చ జరుపాలలి షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలోని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ లేకుండా కరువు పై చర్చ జరపాలని చెప్పారు. రాష్ట్రంలో నాలుగు వేల ప్రభుత్వ స్కూళ్ళు మూత పడ్డా కేసీఆర్  ప్రభుత్వం ఏందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
shabbir ali
ప్రభుత్వం నిధులు ఇవ్వక ఆరోగ్య శ్రీ  పథకం అమలు కావట్లేదని చెప్పిన షబ్బీర్ అలీ.. అయినప్పటికీ ఆరోగ్య శాఖ మంత్రి పట్టించుకోవట్లేదని విమర్శించారు. నిధులు విడుదల చేయనిదే వైద్యం చేయమని వైధ్యులంటున్నారని చెప్పారు. మాట్లాడితే కాళేశ్వరం తప్ప సీఎం కేసీఆర్ మరో సమస్య ను పట్టించుకోరా అని షబ్బీర్ అలీ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్దిక పరిస్థితిపై ప్రభుత్వం స్వేత పత్రం విడుదల చేయాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై కేంద్రం చేసిన ప్రకటనకు కేసీఆర్ ప్రభుత్వం ఇంకా సమాధానం ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. గ్రామ పంచాయతీలలో నిధులు లేక కనీస అవసరాలు కూడా తీర్చలేక పోతున్నారని షబ్బీర్ అలీ ఆవేధన వ్యక్తం చేశారు. సర్పంచ్ లు  గ్రామ అవసరాల కోసం  సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారని.. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని చెప్పారు. కామారెడ్డి మైనారిటీ గురుకుల పాఠశాలను మా ప్రభుత్వంలో నిర్మించామని చెప్పిన షబ్బీర్ అలీ.. విధ్యార్దును పాఠశాల నుండి తరలించి ఆ బిల్డింగ్ ను కలెక్టర్ ఆఫీస్ చేసారని మండిపడ్డారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.