News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

తెలంగాణ గవర్నర్ గా ‘చిన్నమ్మ’

తెలంగాణ ,ఏపీలకు త్వరలో కొత్త గవర్నర్లు రానున్నారా..అంటే అవునంటున్నాయి కేంద్ర ప్రభుత్వ వర్గాలు. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత .. కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తుందని తెలుస్తుంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలకు మించకుండా ఏపీకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నందున.. ఇన్నాళ్లు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహ్మన్ కొనసాగిస్తువస్తున్నారు. 2009 నరసింహ్మన్ కొనసాగుతూ వస్తున్నారు.

ఇక ఏపీ, తెలంగాణ వేర్వేరుగా పరిపాలన సాగిస్తుండడం.. అంతేకాకుండా హైకోర్టు విభజన జరిగి ఏపీలో హైకోర్టు ఏర్పడిన నేపథ్యంలో గవర్నర్లను కూడా వేరు వేరుగా నియమిస్తే బాగుంటుందని కేంద్రం అభిప్రాయం. దీనికి తోడు ప్రస్తుత   గవర్నర్ నరసింహ్మన్ టీఆరెస్ పార్టీకి వత్తాసు పలుకు తున్నారని ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. దీనికితోడు .. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వేర్వేరు గవర్న‌ర్‌లను నియమించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కేంద్రాన్ని కోరుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే కేంద్రంలో పలుకుబడి కల్గిన నర్సిహ్మాంన్ ను ఇక్కడినుండి తప్పిస్తే ..మరో కీలక పోస్ట్ ఆయనను వరిస్తుందని టాక్ .

- Advertisement -

sushma_swaraj_and_bandaru_datthathreya

ఇక తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ లు ఎవరు వస్తారన్నదానిపై ..పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటులో  కీలంగా వ్యవహరించిన సుస్మాస్వరాజ్ ను తెలంగాణ కు గవర్నర్ గా నియమిస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇక బీజేపీ నేత దత్తాత్రేయ ఎప్పడినుండో గవర్నర్ పదవిపై ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఇక మొన్న జరిగిన  ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ ను త్యాగం చేసిన దత్తాత్రేయను ఏదో ఒక ఈశాన్య రాస్త్రానికి గవర్నర్ గా పంపి .. అక్కడున్న గవర్నర్ ను ఏపీకి గవర్నర్ గా పంపుతారని ప్రచారం జరుగుతుంది. దీనితో చిన్నమ్మ తెలంగాణ గవర్నర్ గా ..దత్తన్నకు గవర్నర్ పోస్ట్ వరించే అవకాశం కనిపిస్తుంది.

Leave A Reply

Your email address will not be published.