News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

దేశమంటే భూముల కలయిక కాదు

భారతదేశం ప్రజల సమైక్యతతో ఏర్పడిందని.. ఇది భూముల కలయిక కాదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహూల్ గాంధీ అన్నారు. దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న ప్రఖ్యాత కవి గురజాడ అప్పారావ్ వ్యాఖ్యలను ఈ సందర్బంగా గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్‌ను రెండుగా విడదీయడాన్ని రాహూల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. కశ్మీర్‌లో ప్రజా ప్రతినిధులను జైల్లలో పెట్టడం, గృహ నిర్భంధంలో ఉంచడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఆయన వ్యాఖ్యానించారు.

rahul

- Advertisement -

జమ్మూ కశ్మీర్‌ను ఏకపక్షంగా విడదీయడం వల్లనో.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులను జైల్లలో వేయడం ద్వారనో జాతి సమైక్యత పెరగదని రాహూల్ అన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తుందని.. ఈ దేశం మనుషుల ఐక్యతతో ఏర్పడింది కానీ, భూములు, ప్లాట్లతో కాదని ఘాటుగా స్పందించారు. కార్యనిర్వాహక అధికారాన్ని దుర్వినియోగం చేస్తే మన జాతీయ భద్రతకు తీవ్ర పరిణామాల్ని తెచ్చి పెడుతుందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, ప్రజాస్వామ్య విలువల్ని కూలదోసిందని రాహూల్ గాంధీ మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.