News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

నాగార్జున గురించి అనసూయ..

అక్కినేని నాగార్జునతో తనకు పోటీ ఏంటని అంటోంది హాట్ యాంకర్ అనసూయ. అనసూయ ప్రధాన పాత్రలో నటించిన కథనం సినిమా.. నాగార్జున నటించిన మన్మథుడు 2 సినిమా ఆగస్ట్‌ 9న విడుదల అవుతున్నాయి. ఈరోజు మన్మథుడు 2 థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో దీనిపై అనసూయ స్పందించింది. అసలు వీరికి నేను పోటీ ఏంటి పిచ్చికాకపోతే.. మన్మధుడు-2 ట్రైలర్‌ చాలా బాగుంది.. నాకిష్టమైన నాగార్జున, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రాహుల్‌ రవీంద్రన్‌, వెన్నెల కిశోర్‌ సినిమాలో ఉన్నారు.. నేను నటించిన కథనం సినిమాతో పాటు మన్మథుడు 2 చూస్తాను అని అనసూయ ట్వీట్‌ చేసింది. అన్నట్లు కథనం సినిమాకు రాజేశ్‌ నాదెండ్ల దర్శకత్వం వహించారు. ఈసినిమాలో అనసూయ సహాయ దర్శకురాలి పాత్రను పోషించింది.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.