News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

పార్ల‌మెంట్ ఉత్త‌మ్ ప్ర‌సంగం..

కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి రైతుల‌న్నా, వ్య‌వ‌సాయం అన్నా చాల చిన్న చూపు ఉంద‌ని, అందుకే వ్య‌వ‌సాయ అభివృద్ది, రైతు సంక్షేమం విష‌యంలో మోదీ ప్ర‌భుత్వం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని టీపీసీసీ అధ్యక్షులు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దేశంలో వ్య‌వ‌సాయం అత్యంత ద‌య‌నీయ ప‌రిస్థితులలో ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. పార్ల‌మెంట్‌లో బ‌డ్జెట్ స‌మావేశాల్లో వ్య‌వ‌సాయ‌, రైతు సంక్షేమం ప‌ద్దుపైన జ‌రిగిన చ‌ర్చ‌లో ఉత్తమ్ ప్ర‌సంగించారు. దేశానికి స్వాతంత్రం వ‌చ్చిన తొలి నాళ్ళ‌లో దేశంలో మ‌నం ఇత‌ర దేశాల నుంచి ఆహర ధాన్యాలు దిగుమ‌తి చేసుకొని పూట గ‌డుపుకున్నామ‌ని ఉత్తమ్ గుర్తు చేశారు. గ‌త ప్ర‌భుత్వాలు చేప‌ట్టిన హ‌రిత విప్ల‌వం, శ్వేత విప్ల‌వం, నీలి విప్ల‌వం కార‌ణంగా వ్య‌వ‌సాయ దిగుబ‌డులు, పాలు, చేప‌ల‌ ఉత్ప‌త్తి ఘ‌ణ‌నీయంగా పెరిగి దేశం ప్ర‌పంచంలో ఆహార ధాన్యాల ఎగుమతిలో తిరుగులేకుండా ఉంద‌ని చెప్పుకొచ్చారు. అయితే బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వ్య‌వ‌సాయ ప్రాధాన్య‌త త‌గ్గిపోయింద‌ని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమ‌ర్శించారు. 2018 – 19 సంవ‌త్స‌రానికి గాను కేంద్రంలో వ్య‌వ‌సాయ బ‌డ్జెట్ 75 వేల 753 కోట్ల రూపాయ‌లు కేటాయిస్తే.. స‌వ‌రించిన బ‌డ్జెట్‌లో కేవ‌లం 53 వేల కోట్ల వ్య‌యం చేశార‌ని, 22 వేల కోట్ల రూపాయ‌ల వ్య‌యం చేయ‌లేద‌ని వివ‌రించారు. నేడు దేశంలో రైతాంగం ప‌రిస్థితి అత్యంత గంద‌ర దయానీయంగా మారిపోయింద‌ని చెప్పారు.

uttam

దేశంలో 65 నుంచి 70 శాతం మంది ప్ర‌త‌క్ష్యంగానో, ప‌రోక్ష్యంగానో వ్య‌వ‌సాయం మీద ఆధార‌ప‌డి ఉన్నార‌ని తెలిపారు.మశాస్త్రీయ‌మైన క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌లు లేక‌పోవ‌డం, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల సేక‌ర‌ణ విష‌యంలో లోప‌భూయిష్ట విధానాలు, స‌రైన పంట‌ల భీమా సౌక‌ర్యం లేక‌పోవ‌డంతో దేశంలో వ్య‌వ‌సాయం గంద‌రోళంగా మారి ప్ర‌తి రోజు 30 మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో రోజుకు రోజుకు అన్న‌దాత‌ల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగిపోవ‌డం బాధ‌క‌ర‌మ‌ని, ఒక్కో ఏడాది 11 వేలు, 12 వేలు, 13 వేల మంది రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని చెప్పారు. జాతీయ నేర ఘ‌నాంకాల‌ విభాగం స‌మాచారం ప్ర‌కార‌మే తాము చెబుతున్నామ‌ని ఉత్తమ్ అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామ‌ని 2016లో కేంద్ర ్ర‌ప‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని, ఇదే విష‌యాన్ని ప్ర‌ధాన‌మంత్రి ప‌దే ప‌దే చెప్పార‌ని కానీ ఈ మూడేళ్ళ‌లో రైతుల ఆదాయం ఎంత పెరిగిందో ఎక్క‌డ చెప్ప‌డం లేద‌ని అన్నారు. ఈ మూడేళ్ళ‌లో వ్య‌వ‌సాయ జీడీపీ కానీ, రైతులు ఆదాయం కానీ ఎక్క‌డ పెరిగిన దాఖ‌లాలు లేవ‌ని, సామాజిక‌, ఆర్థిక సర్వేల‌లో ఎక్క‌డ కూడా రైతు, వ్య‌వ‌సాయ ఆదాయాలు పెర‌గ‌లేద‌ని చెప్పారు.

- Advertisement -

uttam

2014లో ఎన్నిక‌ల ముందు బీజపీ స్వామినాథ‌న్ క‌మీష‌న్ సిఫార‌సుల‌ను అమ‌లు చేస్తామ‌ని.. రైతు పెట్టుబ‌డికి 50 శాతం అద‌నంగా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింద‌ని ఉత్తమ్ గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫ‌డ‌విట్‌లో 50 శాతం అద‌నంగా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం పేర్కొన్న‌ద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. క‌నీస మద్ద‌తు ధ‌ర‌ల విష‌యంలో కేంద్రం రైతాంగాన్ని పెద్ద ఎత్తున న‌ష్టం చేసింద‌ని అన్నారు.  తెలంగాణ‌లో నిజామాబాద్‌లో పసుపుబోర్డు ఏర్పాటు చేయాల‌ని చాల కాలంగా డిమాండ్ ఉంద‌ని ఉత్తమ్ చెప్పారు. ఎన్నిక‌ల ముందు రాజ్‌నాథ్ సింగ్ వ‌చ్చి నిజామాబాద్‌లో ప‌సుపుబోర్డు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని వెంట‌నే అక్క‌డ ప‌సుపుబోర్డు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చ‌ట్టం కింద ప‌నిచేస్తున్న కూలీల‌కు వ్య‌వ‌సాయ ప‌నుల కింద తీసుకోవాల‌ని దీని వ‌ల్ల ప‌థ‌కానికి, వ్య‌వ‌సాయానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అన్నారు. స్వామినాథ‌న్ సిఫార‌సుల మేర‌కు రైతుల‌కు పెట్టుబ‌డులకు అద‌నంగా 50 శాతం ధ‌ర‌లు ఇస్తేనే రైతుల‌కు లాభం ఉంటుంద‌ని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.