News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ప్రజా రాజ్యం నాకు పెద్ద మచ్చ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పుతానని జనసేనతో ఎన్నికల్లో పోటీచేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఊహించని పరాభవాన్ని మూటకట్టుకున్న సంగతి తెలిసిందే. కింగ్ మేకర్ తానే అనుకున్న పవన్ పోటీచేసిన రెండు చోట్ల ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే పార్టీ ఓటమి తర్వాత పాలిటిక్స్ పవన్ ప్యాక్ అప్ చెప్పేస్తారన్న చర్చ తెరపైకి వచ్చింది.

Pawan Kalyan on chiranjeevi

అంతేకాదు బీజేపీ అగ్రనేత , ఆపరేషన్ ఏపీ బాధ్యతల్లో ఉన్న రాంమాధవ్ తో పవన్ భేటీకావడం తో ..ఇక అన్నయ్య లాగే తమ్ముడు ..కమలంలో కలిసిపోతారన్న చర్చ ఊపందుకుంది. దింతో అలర్ట్ అయిన పవన్ కళ్యాణ్ తన “శీలపరీక్ష ” చేసుకుంటున్నారు. ఓటమి తర్వాత ఆత్మీయ సమ్మేళనాలతో .. ఓటమి పై సమీక్షలు చేస్తున్నా ..బయట జరుగుతున్న ప్రచారంతో క్యాడర్ లో అయోమయానికి నెలకొంది ఈ ‘తమ్ముడు’ .. అన్నయ్య అవుతాడని జరుగుతున్న కన్ఫ్యూజన్ కు తెరదించకపోతే జండాపట్టే పట్టేవారు ఉండరని గుర్తించిన పీకే .. పార్టీ జంఢా పీకేనని. ప్రాణం ఉన్నంత వరకు జనసేనను నడిపిస్తానంటూ చెబుతూవస్తున్నారు. అయినా నాటి “అన్నయ్య ప్రజారాజ్యం” జ్ఞాపకాలు జనసైనికులను వెంటాడుతుండటం గమనించిన పవన్ కళ్యాణ్ .. ఇక తాను అన్నయ్య లాంటివాటిని కాను అనిచెప్పుకోవాలని డిసైడ్ అయ్యారు. త

- Advertisement -

Pawan Kalyan on chiranjeevi

చిరంజీవి మెతకతనంతోనే నేడు ప్రజారాజ్యం లేకుండా పోయిందని .. అప్పుడు ఉన్న నేతల ఒత్తిడి కారణంగా ప్రజారాజ్యం పార్టీ నడపలేదని చెప్పుకొచ్చారు పవన్. కానీ నేను అలాంటి వాడిని కానని తన ‘హీరోయిజాన్ని ‘ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ . దీనికి నిన్నటి ఎన్నికల్లో తనవోటమిని ప్రస్తావిస్తున్నారు. ‘ భీమవరంలో నా ఓటమి గురించి చాలా మంది కుంగిపోయారని, అయితే నేను 10 నిమిషాల్లో తేరుకుని తర్వాతేంటి? అని ఆలోచించానని చెప్పుకుంటూ . సినిమాల్లో హీరోలాగా తాను చాలా గట్టోడిని అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అయితే అంతా నాడు అన్నయ్యే చేసాడు తనకే పాపం తెలియదన్నట్లు తపించుకునే ప్రయత్నం చేస్తున్న పీకే .నాటి ప్రజారాజ్యంలో ..యువరాజ్యం అధిపతి తానే అన్నసంగతి మరిచిపోతున్నారు పవన్. మంచైతే నాది .. చెడు అయితే వాళ్ళది కాదన్నట్లు.. మొత్తం తప్పంతా చిరంజీవిపై కి నెట్టడం ఏంటన్న చర్చ అన్నయ్య తమ్ముళ్ళో వ్యక్తం అవుతుంది.

Leave A Reply

Your email address will not be published.