News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ప్రాజెక్ట్ నిర్మాణాల్లో కేసీఆర్ అవినీతి రాజ్యమేలుతోంది ..!

నల్గొండ : రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ .. గిరిజన వర్సిటీతో సహా విభజన చట్టంలోని హామీలను మోదీ తుంగలో తొక్కారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ మతతత్వ పార్టీ అని పీసీసీ కెప్టెన్ ద్వజమెత్తారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న సీఎం కేసీఆర్‌ .. డిండి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. దేవరకొండ పరిధిలోని గుట్ట ప్రాంతాలకు ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ హామీ ఇచ్చారు.

Uttam

- Advertisement -

గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందన్నారు ఉత్తమ్. వాటిని పెంచే విషయమై కేంద్రంపై ఒత్తిడి తేవడంలో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. గిరిజనులకు 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచేలా లోక్‌ సభలో ఒత్తిడి తెస్తానని చెప్పారు. గతంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు ఐటీఐఆర్‌ ప్రాజెక్టును మంజూరు చేసిందని .. అది ప్రారంభమై ఉంటే 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించి ఉండేవన్నారు. నెహ్రూ కుటుంబం దేశానికి చేసిన సేవలను .. కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధిని గ్రామగ్రామాన వివరించాలని కార్యకర్తలకు ఉత్తమ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ కు మళ్లీ పూర్వవైభవం వస్తుందని .. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన అన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ … హామీల అమలులో విఫలమయ్యారన్నారు. తెలంగాణలో కేసీఆర్ కు ప్రత్యమ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు ఉత్తమ్.

Uttam

Leave A Reply

Your email address will not be published.