News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ప్రియా వారియర్ కు బోనీ నోటీస్

దివంగత అందాల తార శ్రీదేవి భర్త.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్‌.. కన్నుగీటి ఒక్కసారిగా సెలబ్రెటీ అయిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌కు నోటీసులు ఇచ్చారు. ప్రియా ప్రకాష్ వారియర్ ప్రధాన పాత్రలో నటించిన మొదటి బాలీవుడ్‌ సనిమా శ్రీదేవి బంగ్లా. మలయాళ దర్శకుడు ప్రశాంత్‌ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ ఇటీవల విడుదలై సంచలనం రేపుతోంది. ఈ సినిమా ట్రైలర్‌, టైటిల్‌ని బట్టి చూస్తే ఇది శ్రీదేవి జీవితాధారంగా తెరకెక్కించిన సినిమా అన్న అనుమానం కలుగుతోంది. ఈ సినిమా ట్రైలర్ లో శ్రీదేవి బాత్‌ టబ్‌ లో పడి చనిపోయిన సన్నివేశాన్ని చూపించడంతో ఈ అనుమానం మరింత బలపడుతోంది.

sridevi

- Advertisement -

అందుకే ఈ సినిమాలో నటించిన ప్రియా ప్రకాష్ వారియర్ తో పాటు చిత్రబృందానికి బోనీకపూర్ నోటీసులు పంపించారు. బోనీ కపూర్‌ నుంచి తమకు నోటీసులు వచ్చాయని.. తాము దీనిని ఎదుర్కొంటామని.. తనది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమంటున్న డైరెక్టర్ ప్రశాంత్… శ్రీదేవి అన్నది సాధారణంగా అమ్మాయిలు పెట్టుకునే పేరేనని బోనీ కపూర్ కు నచ్చజెప్పినట్లు తెలిపారు. ఇక ఇది శ్రీదేవి సినిమానో.. కాదో అని తెలిాలంటే మాత్రం ముందు సినిమా చూడాలి కదా అని ఎదురు ప్రశ్నిస్తోంది ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్. శ్రీదేవి బయోపిక్ సినిమాను తానే నిర్మించాలని బోనీ కపూర్ భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.