News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బాబు కుటుంబానికి భద్రత తొలగింపు

babu

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ చేరుకున్నారు. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడే కుటుంబ సభ్యులకు ఏపీ సర్కార్ భద్రతను కుదించింది. జెడ్‌ కేటగిరీ ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌కు భద్రత తగ్గించి 2+2 గన్‌ మెన్లను కేటాయించారు. ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సహా మిగతా కుటుంబ సభ్యులకు పూర్తిగా భద్రత తొలగించారు. దీనిపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

కనీస సమాచారం ఇవ్వకుండా.. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు.. ఇలా భద్రత తగ్గించడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఆయన పాద యాత్ర చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా భద్రత కల్పించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబుపై ఇలా కక్ష్య పూరితంగా వ్యవహరించడం సరికాదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఐతే నిబంధనల మేరకే చంద్రబాబు కుటుంబ సభ్యుల భద్రతను కుదించామని ఏపీ పోలీసులు సమర్ధించుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.