News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బిగ్ బాస్-3 లో పాల్గొంటోంది వీళ్లా?

బిగ్‌బాస్ షో.. త్వరలో సీజన్‌-03తో అభిమానుల ముందుకు రానుంది. తెలుగులో రెండు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. జులై రెండో వారంలో మూడవ సీజన్ ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ సీజన్ 1 కు జూనియర్ ఎన్టీఆర్, సీజన్ 2కు నాని హోస్ట్ లుగా వ్యవహరించగా.. బిగ్‌బాస్‌ సీజన్ 3 కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తారని అధికారికంగా మా యాజమాన్యం ప్రకటించింది. ఇక ఇప్పుడు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే పార్టిసిపెంట్స్ ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరెవరు ఎంట్రీ ఇస్తారన్నదానిపై అటు సోషల్ మీడియాలో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా బిగ్‌బాస్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక అనధికార వర్గాల సమాచారం మేరకు బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే వారు వీళ్లేనంటూ ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
big boss
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ జాబితా…..
A- యాంకర్ శ్రీముఖి
B- తీన్ మార్ సావిత్రి
C- టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్
D-  డ్యాన్స్ మాస్టర్ రఘు
E-  సింగర్ హేమచంద్ర
F- వివాదాస్పద నటి శ్రీరెడ్డి
G- సింగర్ రాహుల్ సిప్లిగంజ్
H- యాంకర్ ఉదయభాను
I- హీరో వరుణ్ సందేశ్
J- యాంకర్ లాస్య
K- ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్
L- మహాతల్లి ఫేమ్ జాహ్నవి
big boss

- Advertisement -

ఐతే బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభమయ్యాక .. ఇందులో ఎవరెవరు ఉన్నారన్నదానిపై స్పష్టత రానుంది. మొత్తనాకి అక్కినేని నాగార్జున బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ గా వ్యవహరించడం బిగ్ బాస్ ప్రియుల్లో ఆసక్తి పెంచుతోంది.

Leave A Reply

Your email address will not be published.