News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి

టీడీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ మారడం ఖచ్చితంగా ఫిరాయింపు చర్యేనని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఫిరాయింపు చర్యలకు విలీనం అని ముసుగు వేసి నాటకం ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. యూరప్ పర్టనలో ఉన్న చంద్రబాబు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, మాజీ స్పీకర్‌ కోడెల శివ ప్రసాదరావు, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు,  ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, మద్దాలి గిరి తదితరులు చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రాజ్యసభలో నలుగురు టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరడం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది.  తెలుగుదేశం ఎంపీలు కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీలో చేరారని చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు విలీనం అని పేరు పెట్టి నాటకం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. ఈ విలీనం చెల్లదని.. వారి చర్య కచ్చితంగా పార్టీ ఫిరాయింపేనని అన్నారు. చట్ట ప్రకారం అనర్హత వేటు వేయాల్సిందేనని చెప్పారు. దీని కోసం మన ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌ను కలిసి లేఖ ఇచ్చారని పార్టీ నేతలకు వివరించారు. వారిపై వేటు పడేవరకూ పోరాడదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. బీజేపీ కుట్రలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, టీడీపీని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలను ఎండగట్టాలని చంద్రబాబు నేతలకు చెప్పారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.