News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

బీజేపీ మత రాజకీయం చేస్తోంది..


న్యూస్ పిల్లర్- సెప్టెంబర్ 17కు బీజేపీ-ఎంఐఎం కు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్బంగా ఆయన గాంధీభవన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ విలీన దినోత్సవంపై బీజేపీ మతపరమైన రాజకీయం చేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. హైదరాబాద్ సంస్ధానం విలీనం చేసింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత కల్వకుంట్ల కుటుంబానిదే పెత్తనం నడుస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిడ్డారు. తెలంగాణకు దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్.. మాట తప్పారని విమర్శించారు. దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కాంగ్రెస్ నాయకులు ఐకమత్యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్ల భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హనుమంతా రావు, పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి తదతరులు పాల్గొన్నారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.