News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

భార‌త్ లో ..ఉస్సేన్ బోల్ట్..

ఉస్సేన్ బోల్ట్.. ప్ర‌పంచంలో లో మేటీ అథ్లేట్.. ట్రాక్ పై ర‌న్నింగ్ ప్రారంబించ‌డ‌మే త‌ప్పా.. అంతా మెరుపు వేగంతో టార్గెట్ రీచ్ అవుతారు బోల్ట్. ఇత‌ను  9.58 సెక‌న్ల‌లో 100 మీ. ప‌రుగెత్తి ప్ర‌పంచ రికార్డ్ సృష్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండియాలో కూడా ఓ ఉస్సేన్ బోల్ట్ ఉన్నారా..? ఆశ్య‌ర్య‌పోకండి. బోల్ట్ కు నేను ఏమాత్రం తీసిపోన‌నే విధంగా.. త‌న ప్ర‌తిభ‌ను చాటుకున్నారు మ‌ధ్య‌ప్ర‌ధేశ్  కుర్రాడు.  మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లాలోని రైతు కుటుంబానికి చెందిన 19 ఏళ్ళ‌ రామేశ్వర్  గుజ్రార్ 11సెకన్లలో 100మీ ప‌రుగెత్తి అంద‌రిని ఆశ్య‌ర్యానికి గురిచేస్తున్నారు. అయితే అది కూడా  కాళ్ల‌కు ఏ షూస్ లేకుండా.. వ‌ట్టీ కాళ్ళ‌తో ప‌రిగెత్తిన రామేశ్య‌ర్ వీడియో.. ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. నిరుపేద కుటుంబానికి చెందిన‌.. రామేశ్వ‌ర్ ఇప్ప‌డి వ‌ర‌కు ఏక్క‌డా.. శిక్ష‌ణ పొంద‌లేదు. ఇప్పుడు రామేశ్య‌ర్ ప్ర‌తిభ‌పై దేశ‌వ్యాప్తంగా.. ప్ర‌శంశ‌లు కురుస్తున్నాయి. రామేశ్వ‌ర్ ను ప్రోత్స‌హిస్తే..  మ‌రో ఉస్సేన్ బోల్ట్ కావ‌డం ఖాయ‌మ‌ని నెటిజ‌న్ లు అభిప్రాయ ప‌డుతున్నారు.

central_sports_minister_on_rameswer_gujrar.

- Advertisement -

అయితే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన రామెశ్వ‌ర్ వీడియోను చూసిన‌ మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి  శివరాజ్ సింగ్ చౌహన్ త‌న  ట్విట్టర్లో షేర్ చేశారు. దాంతో పాటు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజ్జును ఈ రామేశ్వ‌ర్ కు  సహాయం చేయాల్సిందిగా  కోరారు చౌహాన్. ‘భారత్ ఎంతో నైపుణ్యాన్ని దక్కించుకుంది. చక్కటి అవకాశాలు, మంచి ప్లాట్ ఫాంలు దొరికితే వారిలో ప్రతిభ చరిత్ర సృష్టిస్తుంది. ఈ అథ్లెట్ కు సాయం చేసి అతని నైపుణ్యాన్ని మెరుగయ్యేలా చూడండి’ అని శివరాజ్ సింగ్ చౌహన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. భారత్ ఎంతో నైపుణ్యాన్ని దక్కించుకుంది. చక్కటి అవకాశాలు, మంచి ప్లాట్ ఫాంలు దొరికితే వారిలో ప్రతిభ చరిత్ర సృష్టిస్తుంది. ఈ అథ్లెట్ కు సాయం చేసి అతని నైపుణ్యాన్ని మెరుగయ్యేలా చూడండి’ అని శివరాజ్ సింగ్ చౌహన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీనిపై క్రీడా మంత్రి వెంటనే స్పందించారు. భారత దేశపు అథ్లెటిక్ అకాడమీలో చేర్పించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. నిజంగా రామేశ్య‌ర్ కు కాస్త సాన పెడితే.. ప్ర‌పంచంలో మ‌రో ఉస్సేన్ బోల్ట్ కావ‌డం ఖాయం అంటున్నారు స్పోర్ట్స్ ల‌వ‌ర్స్ .

Leave A Reply

Your email address will not be published.