News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ముందు మీరేంటో అర్ధం చేసుకోవాలి

లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకున్న 52 మంది ఎంపీలతో కలిసి బీజేపీతో ప్రతి రోజూ పోరాడుతామని ఏఐసీసీ అధ్యక్షులు రాహూల్ గాంధీ అన్నారు. తొలిసారిగా ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాహూల్ మాట్లాడారు. ముందు మీరేంటో అర్థం చేసుకోవాలని పార్టీ ఎంపీలకు చెప్పిన రాహూల్.. ప్రతి భారతీయుడి తరఫున మీరు పోరాడుతున్నారని అన్నారు. ద్వేషం, కోపం మిమ్మల్ని వెంటాడుతున్నా అంతకంటే దూకుడుగా ముందుకెళ్లాలని ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. లోక్‌సభలో మనకు ఇంకా 52 మంది సభ్యులు ఉన్నారని చెప్పిన ఆయన.. సరైన సిద్ధాంతాల కోసం బీజేపీతో ప్రతిరోజూ పోరాడుదామని స్పష్టం చేశారు. ఓవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే.. మరోవైపు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంతా కలిసికట్టుగా ముందుకెళ్తాలని రాహూల్ గాంధీ చెప్పారు.

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.