News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

ముంపు ప్రాంతాల్లో బాధితులకు బియ్యం-దుస్తుల పంపిణి ..!

న‌ల్గొండ : నల్గొండ జిల్లాలో కృష్ణాన‌ది వరద ప్రాంతాలలో ముంపు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు పీసీసీ చీఫ్ ..న‌ల్గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ముంపు ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. సూర్యాపేట జిల్లా పాలకీడు, మఠంపల్లి, చెంచాలపాలెం మండలాల్లో ఆయ‌న పర్యటించారు. ఆయా మండలాల్లో కృష్ణ వరదలకు ముంపునకు గురైన వరి .. పత్తి పంటలను పరిశీలించి బాధితులను పరామర్శించిన ఉత్తమ్ .. వారికి అండ‌గా ఉంటాన‌ని భ‌రోసా ఇచ్చారు. ఈ వ‌ర‌ద‌ల‌తో మత్యకారుల వలలు .. బోట్లను నష్టపోయిన వారికి ప్ర‌భుత్వం త‌క్ష‌ణం సహాయం అందించాలని ఉత్త‌మ్ డిమాండ్ చేశారు. వ‌ర‌ద‌ల్లో న‌ష్ట‌పోయినా పంటలను వెంట‌నే ప్ర‌భుత్వ అధికారులు ప‌రిశీలించి ..పూర్తిగా నష్టపరిహారం ఇవ్వాలని స‌ర్కారును డిమాండ్ చేశారు ఉత్తమ్.

Uttam

- Advertisement -

ఈ వ‌ర‌ద ముంపులో న‌ష్ట‌పోయిన కుటుంబాల‌కు కాంగ్రెస్ పార్టీ తరపున బియ్యం .. బట్టలు అందజేశారు ఉత్తమ్ . సూర్యాపేట జిల్లా, పాలకీడు మండలం శూన్యపహాడ్ లో ముంపు కు గురైన పంట పొలాల బాధితులతో క‌లిసిన మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి .. రావిపహాడ్ గ్రామ పరిధిలో ని గంగా భవానీ పురంలో ముంపు బాధితులకు బియ్యం, దుస్తులను పంపిణీ చేసి .. అండ‌గా ఉంటాన‌ని .. ఏ స‌మ‌స్య వ‌చ్చినా త‌న దృష్టికి తీసుకురావాల‌ని సూచించారు.

Uttam

Leave A Reply

Your email address will not be published.