News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జెండా పండగ నిర్వహించాలని పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు ప్రతి మున్సిపాలిటి లో ఇంటింటికి కాంగ్రెస్, వాడవాడలా కాంగ్రెస్ జెండా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన ఆదేశించారు. ప్రతి కార్యకర్త తన ఇంటి పైన, ప్రతి వాడలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఉత్తమ్ చెప్పారు. అంతే కాకుండా ప్రతి ఒక్కరు తమ తమ వాహనానికి కాంగ్రెస్ పార్టీ జెండా కట్టుకోవాలని అన్నారు. ఈనెల 26వ తేదీన అన్ని మున్సిపల్ కేంద్రాలలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా కృషి చేద్దామని ఆయన అన్నారు.

- Advertisement -

Tags: uttam, pcc chief uttam, uttam about flag festival, uttam about congress flag festival, congress flag festival, telangana congress flag festival, uttam about municipal election

Leave A Reply

Your email address will not be published.