News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మెదడు మార్పిడి మైండ్ కు ఎక్కదు

సినిమా- ఇస్మార్ట్ శంకర్
తారాగణం- రామ్‌, నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌, సత్యదేవ్‌, గెటప్‌ శ్రీను, షాయాజీ షిండే తదితరులు
మ్యూజిక్- మణిశర్మ
నిర్మాతలు- పూరి జగన్నాథ్‌, ఛార్మి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం- పూరి జగన్నాథ్

పరిచయం……
డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ గురించి కొత్తగా తెలుగు ప్రేక్షకులుకు చెప్పేదేం లేదు. తెలుగు సినిమా హీరోయిజానికి కొత్తదనాన్ని అద్దిన దర్శకుడు పూరి జగన్నాధ్. పూరీ కెరీర్ లో ఎన్నో అద్భుత విజయాల్ని అందుకున్నారు. కానీ ఈ మధ్య మంచి బ్రేక్ లేక పూరి కాస్త వెనుకబడిపోయారు. అందుకే ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలన్న పట్టుదలతో ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమా తీశారు. ఇప్పటి వరకు డిఫరెంట్ క్యారెక్టర్స్ పోషిస్తూ.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రామ్‌ ఈ సినిమాలో హీరో. ఇంతకీ పూరి జగన్నాధ్, రామ్‌ కాంబినేషన్ ఎలా ఉంది.. ఉర మాస్‌ క్యారెక్టర్ లో రామ్ ఎలా చేశాడు..
500
కధ…….
శంకర్‌ (రామ్‌) ఓ కిరాయి గూండా. అతనికి అదరు, బెదురు లేదు. ఈ క్రమంలో డబ్బుల కోసం ఓ కిరాయి హత్య చేస్తాడు. ఈ హత్య తరవాత  పోలీసులు రామ్‌ని వెంటాడుతుంటారు. పోలీసులకు, తనకి జరిగిన పోరాటంలో తన ప్రాణానికి ప్రాణమైన చాందిని (నభా నటేషా)ని కోల్పోతాడు తామ్. ఇంకేముంది తన ప్రియురాలి చావుకి కారణమైన వాళ్ల కోసం గాలిస్తుంటాడు రామ్. ఈ క్రమంలో రామ్ కూడా ఓ ప్రమాదంలో గాయపడి, సీబీఐ అధికారులకు పట్టుబడతాడు. ఈ సందర్బంలోనే ఓ పోలీస్‌ అధికారి (సత్యదేవ్‌)కి చెందిన మెమొరీ కార్డుని శంకర్‌ మెదడులో నిక్షిప్తం చేయాల్సి వస్తుంది… ఇంతకీ పోలీస్ అధికారి చిప్ ను రామ్ మెదడులో ఎందుకు పెట్టారు.. ఆ తరువాత రామ్ ఎలా మారిపోయాడు.. అన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే..

ఎలా ఉందో తెలుసా……..
పూరి జగన్నాధ్ అంటేనే మాస్ సమాలా. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంపైనే పూరి స్కెచ్ ఉంటుంది. ఐతే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మెదళ్ల మార్పిడి అనే కొత్త కాన్సెప్ట్‌ని ఎంపిక చేసుకున్నాడు పూరి. ఇంతకీ మెదళ్ల మార్పిడి చేవచ్చా.. అనే విషయంపై ప్రేక్షకులకు ఎలాంటి అనుమానాలూ రాకుండా, సినిమా మొదట్లోనే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. హీరో రామ్‌ పాత్రని మలిచిన విధానమే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. పూరి సినిమాల్లో సాధారనంగానే హీరోలు మాస్ గా ఉంటారు.. ఈ సినిమాలో ఇంకాస్త డోస్ పెంచి రామ్ పాత్రను రూపొందించాడు పూరి. రామ్‌ స్టైల్, మాటలు, చేష్టలూ అన్నీ మాస్‌ ప్రేక్షకులకు నచ్చుతాయి. రామ్‌ కనిపించిన ప్రతి సన్నివేశం మాస్‌ కోసమే అన్నట్లుగా ఉంటాయి. ఇందుకు అనుగునంగానే హీరోయిన్ నభా నటేష్‌ పాత్ర కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. ఇక మెదడు మార్పిని తరువాత ఒక్కడే ఇద్దరిలా ప్రవర్తిస్తుంటాడు. సినిమా కథంతా దాని చుట్టూనే తిప్పుతూ, అందులోనే వినోదాన్ని పంచిపెట్టే ప్రయత్నం చేశాడు.

- Advertisement -

అంతా ఇలా చేశారు….
ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో మాస్ కు దగ్గర కావాలన్న తన లక్ష్యం నెరవేర్చుకున్నాడు హీరో రామ్. రామ్‌లోని ఎనర్జీ మొత్తం శంకర్ పాత్రలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నటుడిగా తనకు పూర్తి సంతృప్తి లభిస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక హీరోయిన్ల పాత్రలు రెండూ కేవలం గ్లామర్‌ కోసమే అన్నట్లుగా ఉన్నాయి. నభా పాత్రకైతే డోసు ఇంకాస్త ఎక్కువైంది. సత్యదేవ్‌ కీలక పాత్రలో కనిపిస్తాడు. షాయాజీ షిండేతో సహా మిగిలిన పాత్రలన్నీ రొటీన్‌గానే అనిపిస్తాయి. మణిశర్మ పాటలు మాస్‌కి బాగా నచ్చుతాయి. అందులో రామ్‌ వేసిన స్టెప్పులు కూడా ఆకట్టుకుంటాయి. పూరి జగన్నాధ్ డైలాగులు ఈ సినిమాకి హైలెట్ అని చెప్పవచ్చు. తెలంగాణ యాసలో రాసిన సంభాషణలు మాస్ కి బాగా కిక్‌ ఇస్తాయి. ఐతే మెదడు మార్పడి వ్యవహారం ప్రేక్షకులకు సరిగ్గా అర్దం కాకపోవడంతో.. కేవలం మాస్ డైలాగ్స్ కోసం మాత్రమే సినిమాకు వెళ్తాలి.

న్యూస్ పిల్లర్ రేటింగ్- 2.5/5
గమనిక- ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం

Leave A Reply

Your email address will not be published.