News Pillar
Today’s Latest Telugu News Online, Breaking News in Telugu, Get Telugu News Headlines Form AP,Telangana Politics, Crime, Sports, Cricket, Business, Technology, Telugu Movies, Photos, and Videos

మ‌హేష్ ..మ‌హ‌ర్షి.. ఇలా..!!

సినిమా పిల్లర్- ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా రివ్యూ ప్రత్యేకంగా మీకోసం..
సినిమా- మహర్షి
తారాగణం- మహేశ్‌ బాబు, అల్లరి నరేష్‌, జగపతిబాబు, పూజ హెగ్డే, ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, రావు రమేశ్‌, తదితరులు
మ్యూజిక్- దేవి శ్రీ ప్రసాద్‌
కమెరా- కె.యు. మోహనన్‌
నిర్మాత- దిల్‌ రాజు, సి. అశ్వినీదత్‌, ప్రసాద్‌ వి. పొట్లూరి
దర్శకత్వం- వంశీ పైడిపల్లి

మహేష్ బాబు సినిమా అంటేనే భారీ అంచనాలుంటాయి. చేసిందే తక్కువ సినిమాలే అయినా మహేష్ కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. భరత్ అనే నేను అనే బ్లా బాస్టర్ సినిమా తరువాత మహేష్ బాబు చేసిని సినిమా కావడంతో మహర్షికి విపరీతమైన పై క్రియేట్ అయ్యింది. మహేష్ బాబు స్టార్ డంకు తగ్గట్టుగానే మహర్షి సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. సుమారు 120 కోట్ల రూపాయలతో ముగ్గురు ప్రముఖ నిర్మాతలు కలిసి ఈ సినిమాను నిర్మించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పొట్లూరి వరప్రసాద్ మహర్షి సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. దీంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి వంశీ పైడిపల్లి మహర్షి సినిమాను ఎలా తీశాడు.. మహేష్ ఎలా నటించాడు అన్నది తెలుసుకుందామా…..

maharshi_cinema
మహర్షి కధ…
మ‌హేష్ బాబు (రిషి కుమార్) ఓ కంపెనీకి సీఈఓ గా పనిచేస్తుంటాడు. ఏ విషయంలోను ఓడిపోవ‌డం అంటే ఏమిటో తెలియని  బిజినెస్ మెన్ మహేష్ బాబు. ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి నేప‌థ్యం నుంచి వ‌చ్చి.. త‌న క‌ష్టాన్నీ, క‌ల‌ల్ని, విజ‌యానికి సోపానాలుగా మ‌ల‌చుకుని.. అంచెలంచెలుగా పైకి ఎదుగుతాడు. త‌న జీవితం, త‌న విజ‌యాలు త‌నొక్క‌డి క‌ష్టానికి వ‌చ్చిన ప్ర‌తిఫ‌లాలు కాదని, వాటి వెనుక త‌న ఇద్ద‌రి స్నేహితుల (అల్ల‌రి న‌రేష్‌, పూజా హెగ్డే) క‌ష్టం, త్యాగం కూడా ఉన్నాయ‌ని తెలుసుకుంటాడు మహేష్ బాబు. ఇంతకీ వారిద్దరి కోసం మహేష్ బాబు ఏం చేశాడు.. విజ‌యం అంటే డ‌బ్బు సంపాదించడం.. హోదాను, స్థాయిని పెంచుకోవ‌డ‌మే అనుకునే మహేష్ బాబు.. అస‌లు సిస‌లైన విజ‌యాన్ని ఎలా గుర్తించాడన్నదే మహర్షి అసలు కధ..
సినిమా ఎలా ఉందంటే..
మహర్షి ప్రిన్స్ మ‌హేష్ బాబు 25వ సినిమా. ఒక పరిపూర్ణమైన సినిమాలో ఏయే అంశాలు ఉండాలో అవన్నీ కలబోసి రూపోందించిన సినిమానే మహర్షి అని అనిపించక తప్పదు.  ఓ కంపెనీకి సీఈఓగా మహేష్ బాబును ప‌రిచ‌యం చేసే స‌న్నివేశాలు చాలా చాలా రిచ్ గా చూపించారు. మహేష్ బాబు పరిచయం అయిన వెంటనే కధ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోతుంది. కంపెనీ సీఈఓగా, కాలేజ్ స్టూడెండ్ గా వెను వెంటనే ఒక పాత్రలోనే రెండు వేరియేష‌న్స్ అద్బుతంగా చూపించాడు మ‌హేష్‌ బాబు. ఇక కాలేజీలో గడిచే స‌న్నివేశాలు స‌ర‌దాగా అనిపిస్తాయి. ప్రేమ‌, స్నేహం వంటి ఎమోష‌న్స్ ను టచ్ చేస్తూనే.. విద్యా వ్య‌వ‌స్థ తీరు తెన్నుల‌ను ఎత్తి చూపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఓ సమయంలో మహర్షి సినిమాలోని కాలేజ్ భాగం త్రీ ఇడియ‌ట్స్ సినిమాను తలపిస్తుంది. మొదటి భాగం మొత్తం కాలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే సాగిపోతుంది

maharshi_telugu_movie

ఇక సెకండ్ హాఫ్ లో రైతు స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తాడు మహేష్ బాబు. కొన్ని సన్నివేశాల్లో రైతుల దీన‌స్థితిని క‌ళ్ల‌కు క‌ట్టినట్లు చూపించారు. మహేష్ బాబు ల‌క్ష్యం, ఆశ‌య సాధ‌న‌కు ఎంచుకున్న మార్గం.. అనుసరించే విధానాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. భారీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో ఇలాంటి సామాజిక అంశాన్ని చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించ‌డం మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఐతే ఒకే అంశంతో సెకండ్ హాఫ్ మొత్తం న‌డిపించ‌డం కాస్త సాగదీసినట్లుగా అనిపించక మానదు. స‌న్నివేశాల్ని కొంత మేర కుదించుకునే అవకాశం ఉన్నా.. మూడు గంటల పాటు కధను సాగదీశారని ఇట్టే తెలిసిపోతుంది. ఈ క‌థ‌లో చాలా కీల‌కమైన మ‌హేష్ బాబు.. అల్లరి న‌రేష్ ఎపిసోడ్‌లో ఎమోషన్స్‌ ఇంకొంచం పండాల్సి ఉండిందని అనిపిస్తుంది. క్లైమాక్స్ సీన్స్ వ‌ర‌కూ ఎలాంటి మ‌లుపులూ లేకుండా సాగ‌డం, సినిమా మొత్తం ఒకే టెంపోలో రొటీన్‌గానే ఉందని చెప్పవచ్చు.

- Advertisement -

అంతా ఇలా చేశారు..
మ‌హేష్‌ బాబుకు త‌న‌లోని సహజ నటున్ని ప్రదర్శించే అవ‌కాశం మరోసారి ద‌క్కింది. త‌న పాత్ర‌లోని మూడు షేడ్స్ ను మహేష్ బాబు అలవోకగా పండించాడు. ఒక్కో షేడ్‌లో ఒక్కోలా డిఫరెంట్ గా కన్పించాడు. ఓ కంపెనీ సీఈఓగా  చాలా రిచ్ గా.. స్టైలిష్‌గా క‌నిపించిన మ‌హేష్ బాబు.. అటు స్టూడెంట్ గా మాస్‌ని ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు. రైతు స‌మ‌స్య‌లపై పోరాటం చేస్తున్న‌ప్పుడు మహేష్ బాబులో కొత్త కోణం కన్పించింది. గత సినిమాలతో పోలిస్తే మ‌హేష్ బాబు తెర‌పై మ‌రింత అందంగా క‌నిపించాడు. దీంతో మహేష్ అభిమానులు చాలా సంతోషపడ్డారు. ఇక అల్ల‌రి న‌రేష్‌కి మహర్షిలో వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ పోషించారు. ఓ రకంగా చెప్పాలంటే క‌థ‌కి మూల‌స్తంభంగా నిలిచాడని చెప్పడంలో ఏ మాత్రం అతియేశక్తి కాదు.  అల్లరి నరేష్ గత సినిమా గమ్యంలో గాలిశీను పాత్రలా ఈ సినిమాలోని పాత్ర సైతం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

mahesh_babu_new_look_in_maharshi.

ఇక అందాల భామ పూజాహెగ్డేకు మహర్షి సినిమాలో మంచి పాత్ర దక్కింది. ఈ సినిమాలో పూజకు కేవ‌లం గ్లామ‌ర్‌కే ప‌రిమితం చేయ‌కుండా.. క‌థకు అనుగునంగా ప్రాధాన్యం లభించింది. ఇక సీనియర్ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో రిచ్ అండ్ స్టైలిస్ట్ ప్రతి నాయకుడిగా ఆకట్టుకున్నాడు. మొత్తానికి మహర్షి సినిమాను సరదాగా ఓ సారి చూడవచ్చు. కధను కాస్త సాగదీయకుండా ఉండే.. మరింత బాగా వచ్చేదని చెప్పవచ్చు.

సినిమా పిల్లర్ రేటింగ్- 3/5

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.